AP NEW DISTRICTS: కొత్త జిల్లాల ఏర్పాటు…. ఉద్యోగుల కేటాయింపు…ఆర్డర్‌ టూ సర్వ్‌ ఉత్తర్వులు

 


రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులెస్తోంది. తమకందిన ఉత్తర్వులకు ఎవరూ వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానాల్లో సవాలు చేయకుండా మార్చి 31 సాయంత్రం తరువాత అధికారులు, ఉద్యోగులకు ఆర్డర్‌ టూ సర్వ్‌ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణను ఎనిమిది వారాల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎవ్వరూ కోర్టుకెళ్లకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.



G.O.Ms.No.59, Finance (HR.1-Plg.&Policy)  dated:04-07-2019

ఉమ్మడి జిల్లా కేంద్రాలు, డివిజన్‌ కేంద్రాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల వివరాలను ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులు సేకరించారు. ఏయే జిల్లాలకు ఎవరిని పంపాలో జాబితాలను సిద్ధం చేశారు. జిల్లా స్థాయిలో ఇప్పటికే ఆయా శాఖల అధికారులు కొత్త జిల్లాలకు వెళ్లే అధికారులు, ఉద్యోగులకు మౌఖికంగా సమాచారం ఇచ్చారు. జిల్లా అధికారుల ప్రతిపాదనలపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత భర్త ఒక జిల్లాలో, భార్య మరొక జిల్లాలో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో ఇప్పటికిప్పుడు మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటి వరకూ అన్ని సదుపాయాలూ పొందిన అధికారులు కొత్త జిల్లాలకు వెళితే తమకు ఒక కుర్చీ, టేబుల్‌ తప్ప సౌకర్యాలేమీ ఉండవని అధికారులు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. మరో పది రోజుల్లో కొత్త జిల్లాల ఏర్పాటు కానుండగా ఇంత వరకూ మౌలిక సదుపాయాలు, ఫర్నీచర్‌ ఏర్పాటు కాలేదు. వీటి బాధ్యతను ఆర్‌అండ్‌బి శాఖకు అప్పగించారు. వారు టెండర్లు ఖరారు చేసే పనిలో ఉన్నారు

Flash...   స్కూళ్లెందుకు తెరిచారు? విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?