INSURANCE : ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఇక్కడ ఫిర్యాదు చేయండి..?

 INSURANCE : ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఇక్కడ ఫిర్యాదు చేయండి..?


IRDAI: మీరు ఏదైనా ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి పాలసీని కొనుగోలు చేసి దానికి సంబంధించి ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. సదరు కంపెనీ ఈ విషయాన్ని పట్టించుకోపోతే మీరు నేరుగా బీమా నియంత్రణ సంస్థ IRDAIకి ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఏ విధంగా కంప్లెయింట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఇన్సూరెన్స్‌ కంపెనీతో సంతృప్తి చెందకపోతే కంపెనీ బ్రాంచ్‌లోని ఫిర్యాదుల పరిష్కార అధికారి (GRO)ని సంప్రదించవచ్చు. ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నప్పుడు రాతపూర్వక ఫిర్యాదు పేపర్‌తో పాటు అవసరమైన అన్ని పత్రాలను కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. ఫిర్యాదుపై తేదీతో పాటు రికార్డు కోసం రసీదు తీసుకోండి. బీమా కంపెనీ 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తుంది. 15 పని దినాలలో కంపెనీ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదంటే మీరు IRDAIని సంప్రదించవచ్చు

IRDAIలో ఈ విధంగా ఫిర్యాదు చేయవచ్చు 

IRDAI వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ పరిస్థితిలో IRDAIకి సంబంధించి వినియోగదారుల వ్యవహారాల విభాగంలోని గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్‌ని సంప్రదించాలి. దీని కోసం టోల్ ఫ్రీ నంబర్ 155255 లేదా 1800 4254 732కు కాల్ చేయవచ్చు. లేదంటే కంప్లెయింట్ @irda.gov.in కు ఈ-మెయిల్ చేయవచ్చు.

ALSO READ: 

SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే..!

SBI: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. అయితే SBI అందించే ఈ ఆఫర్ మీ కోసమే.

SBI Car Loan: కార్ కొనేవారికి ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్

Flash...   World’s Most Vaccinated Nation Is Spooked by Covid Spike