LIQUID DIET: లిక్విడ్ డైట్.. ఆరోగ్యకరమా? హానికరమా? ..లిక్విడ్ డైటే ‘షేన్ వార్న్’ ప్రాణాలు తీసిందా!

 లిక్విడ్ డైటే ‘షేన్ వార్న్’ ప్రాణాలు తీసిందా!! .. అసలేంటీ డైట్..

Shane Warne: 52 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మరణించడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. క్రికెటర్ గుండెపోటుతో చనిపోయాడని డాక్లర్లు నిర్ధారించారు. కానీ ఇప్పుడు, అతని అకాల మరణం తర్వాత కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వార్న్ 14 రోజుల పాటు ఘన పదార్ధాలు ముట్టకుండా, ద్రవ రూపంలో ఉన్న ఆహారం మత్రమే తీసుకున్నాడని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది అతడి హఠాన్మరణానికి ప్రధాన కారణాలలో ఒకటి కావచ్చు. మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్‌కిన్.. వార్న్ బరువు తగ్గడం కోసం విపరీతంగా డైటింగ్ చేసేవాడని.. అందులో భాగంగానే ద్రవ ఆహారాన్ని తీసుకునేవాడని చెప్పారు.

మొదట్లో 14 రోజులు మాత్రమే ద్రవాలు తీసుకునేవాడు. గతంలో కూడా మూడు నాలుగు సార్లు లిక్విడ్ డైట్ చేసాడు. ఆహారంలో వెన్నతో చేసిన తెల్లటి బన్స్, సగ్గుబియ్యంతో చేసిన ద్రవం, ఆకుపచ్చ కూరగాయలతో చేసిన రసాలు తీసుకునేవాడు. వార్న్ కుమారుడు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. అతని తండ్రి క్రమం తప్పకుండా “30-రోజులు లిక్విడ్ డైట్” లో ఉన్నాడని తెలిపాడు

లిక్విడ్ డైట్.. ఆరోగ్యకరమా? హానికరమా?

Weight Loss : బరువు తగ్గడం అన్నది మాటల్లో చెప్పుకున్నంత తేలిక కాదు. సన్నగా ఉండే వాళ్లని చూసినప్పుడల్లా… అదృష్టవంతులు అని అధిక బరువు ఉండేవాళ్లు అనుకుంటారు. అసలు చిన్నప్పటి నుంచే పిల్లల అధిక బరువుపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. వాళ్లు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటే… బరువు తగ్గించేందుకు ఏం చెయ్యాలో అన్నీ చెయ్యించాలి. ఎందుకంటే… మొక్కై వంగనిది మానై వంగదు అంటారు కదా… చిన్నప్పుడే బరువు అధికంగా ఉండేవారు… పెరిగే కొద్దీ మరింత బరువు పెరిగిపోతారు. కారణం ఒకటే. ఎక్కువ బరువు ఉండేవారికి… ఎక్కువ ఆకలి వేస్తుంది. ఫలితంగా ఎక్కువ ఆహారం తీసుకుంటారు. ఫలితంగా ఎక్కువ బరువు పెరుగుతారు. ఇదో సైకిల్ చక్రంలా… రౌండ్‌గా ఉండే సర్కిల్. ఇందులో చిక్కుకున్న వారు బయటపడేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఈ మధ్యకాలంలో చాలా మంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో… కార్బొహైడ్రేట్స్ ఉండే అన్నం, చపాతీల వంటి ఆహారం మానేసి… పూర్తిగా ద్రవ పదార్థాలు తీసుకుంటున్నా్రు. ఇది కరెక్టేనా?

Flash...   PRC నివేదిక బయట పెట్టే దిశగా అడుగులు.. సజ్జల గారితో ఉద్యోగ సంఘాల నేతల భేటీ

బరువు తగ్గాలంటే… తిండి మానేయాలనో, లేదంటే… ఆల్రెడీ తినే టైపు తిండి మానేసి… పూర్తిగా వేరేది తినాలని ఎవరైనా చెబితే… అది కరెక్టు కాదని గ్రహించాలి. కొంతమందైతే… నిరాహార దీక్ష పాటిస్తారు. తినాల్సిన ఆహారం తినకుండా… హమ్మయ్య… ఇక బరువు తగ్గిపోతాను అనుకుంటారు. అదీ కరెక్టు కాదు. ఇలాంటి వేర్వేరు పద్ధతులు పాటించేవారు… ఆహారం బదులు… లిక్విడ్స్ తీసుకుంటారు. నిమ్మరసం, జ్యూస్‌లు, మిల్క్ షేక్స్ వంటివి రోజుకు మూడు నాలుగు సార్లు తీసుకుంటారు. కొంత మంది భోజనం బదులు లిక్విడ్స్ తీసుకుంటారు. ఇది ఎంతవరకూ కరెక్టు?

పండ్ల రసాలు ఎంత తాగినా శరీరానికి మంచిదే అనుకుంటారు చాలా మంది. అది నిజం కాదు. డయాబెటిస్ ఉన్నవారు… పండ్ల రసాల విషయంలో ఎక్కువ జాగ్రత్త పడాలి. ఎందుకంటే పండ్లలో గ్లూకోజ్ (షుగర్) ఉంటుంది. అది బాడీలోకి వెళ్లి… బ్లడ్‌లో కలుస్తుంది. ఈ గ్లూకోజ్ స్థాయి పెరిగితే… బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతుంది. అది డేంజర్. అందువల్ల పిండి పదార్థాల్ని పక్కన పెట్టి లిక్విడ్ డైట్స్ మాత్రమే తీసుకోవడం మంచిది కాదు

జ్యూసులు, పండ్ల రసాల వల్ల మరో సమస్య కూడా ఉంటుంది. ఏ అన్నమో, చపాతీలో తింటే… అవి వెంటనే బాడీలో, బ్లడ్‌లో కలిసిపోవు కాబట్టి… వెంటనే ఆకలి వెయ్యదు. అదే పండ్ల రసాలైతే… వెంటనే బ్లడ్‌లో కలిసిపోతాయి. కాబట్టి అదే పనిగా ఆకలి వేస్తూ ఉంటుంది. అందువల్ల ఎక్కువ జ్యూస్‌లు తాగాల్సి వస్తుంది. వాటిలో పిండి పదార్థం పెద్దగా ఉండదు కాబట్టి… అవి ఎక్కువ ఎనర్జీని ఇవ్వలేవు. అందువల్ల కేవలం లిక్విడ్సే తాగడం వల్ల ప్రయోజనం ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. రోజూ లిక్విడ్సే తాగుతూ ఉంటే… బాడీ కూడా అందుకు తగ్గట్లుగా మారిపోతుంది. ఎక్కువ కేలరీలు ఖర్చు చెయ్యకుండా… ఎనర్జీ కోసం కేలరీలను దాచుకుంటుంది. అందువల్ల పెద్దగా బరు తగ్గరు. కాబట్టి… అన్ని రకాల ఆహారాలూ తింటూనే… కావాల్సినంత మాత్రమే తినాలి. ఆకలి లేనప్పుడు తినకూడదు. అలాగే… ఒకేసారి కాకుండా… ఆహారాన్ని రోజుకు ఐదుసార్లు… కొద్ది మొత్తాల్లో తింటే మేలు. అలాగే… యాపిల్ వంటి ఆకలి వెయ్యకుండా చేసే పండ్లను తింటే కూడా ప్రయోజనం ఉంటుంది. మొత్తంగా బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారం తినాలో డాక్టర్ల సలహాలు పాటిస్తే… మున్ముందు డయాబెటిస్ లాంటివి రాకుండా జాగ్రత్త పడేందుకు వీలవుతుంది.

Note: ఈ కధనం ఒక అవగాహనా కొరకు మాత్రమే … మరింత అవగాహనా కొరకు లేదా ఆరోగ్య నియమాల కొరకు డాక్టర్ ని తప్పని సరిగా సంప్రదించాలి.