Madras HC: సెల్‌ఫోన్లు వాడొద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాస్‌ హైకోర్టు షాక్‌

 Madras HC: సెల్‌ఫోన్లు వాడొద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాస్‌
హైకోర్టు షాక్‌


చెన్నై: సెల్‌ఫోన్‌ ఇప్పుడు నిత్యావసరం అయిపోయింది. అది లేనిదే పిల్లలకు
ముద్ద దిగడం లేదు. పెద్దలకు పనులు జరగడం లేదు. ఈ తరుణంలో.. పని టైంలో కూడా
ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అదే పనిగా ఫోన్‌లో మునిగిపోవడాన్ని తమిళనాడు
రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది.

ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయ వేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లను
ఉపయోగించకూడదని మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  ఈ మేరకు
తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణియన్‌
మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెంటనే
రూపొందించాలని, రూల్స్‌ ఫాలో కానీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్‌
సుబ్రమణియన్‌ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Madras HC says government servants should not be allowed to use mobile phones for personal use during office hours.

Madras HC Justice SM Subramaniam directed Tamil Nadu Government to frame regulations in this regard and take action against those who do not follow the rules. pic.twitter.com/b2CtEvWx9J

— ANI (@ANI) March 15, 2022

Flash...   ANNUAL PLAN FOR PRIMARY CLASSES 1- 5