Migraine: మైగ్రేన్ సమస్య ఉన్నవారు ఈ పదార్థాలను అస్సలు తినకూడదు..

 Migraine: మైగ్రేన్ సమస్య ఉన్నవారు ఈ పదార్థాలను అస్సలు తినకూడదు.. మర్చిపోతే మరింత ఎఫెక్ట్..

మైగ్రేన్ (Migraine).. తలనొప్పి వంటిందే. తలలో సగభాగం భరించలేనంత నొప్పి వస్తుంది. దీనినే మైగ్రేన్ అంటారు. కొన్నిసార్లు ఇది తల మొత్తం నొప్పి కలిగిస్తుంది. మైగ్రేన్ ఎప్పుడైనా .. ఎవరికైనా రావచ్చు. అంతేకాదు.. ఇది కొన్ని గంటలు లేదా రెండు మూడు రోజుల వరకు వేధిస్తూనే ఉంటుంది. తలనొప్పితోపాటు.. గ్యాస్ట్రిక్.. వికారం… వాంతులు వంటి సమస్యలు వస్తుంటాయి. మైగ్రేన్ సమస్య అనేది జన్యుపరమైనది. అయితే మైగ్రేన్ సమస్య ఉన్నవారు చేసే చిన్న చిన్న పోరపాట్లు.. తలనొప్పిని మరింత తీవ్రం చేస్తుంది. అలాగే.. మీరు తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు కూడా మైగ్రేన్ సమస్యను మరింత వ్యాప్తి చేస్తాయి. మైగ్రేన్ సమస్య ఉన్నవారు తినకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుందామా.

మైగ్రేన్ లక్షణాలు.. 

* చర్మంలో మంటలు. 

* మాట్లాడటం కష్టంగా ఉంటుంది. 

* చిరాకు కలగడం *కళ్ల కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్) 

*శరీరం యొక్క ఒక భాగంలో బలహీనత లేదా తిమ్మిరి 

* చేతులు, కాళ్ళలో జలదరింపు *ఆహార కోరికలు 

*తలలో ఒక వైపు తీవ్రమైన నొప్పి

మైగ్రేన్ సమస్య ఉన్నవారు తినకూడని పదార్థాలు.. 

కాఫీ ఎక్కువగా తీసుకోకూడదు. దీనివలన మైగ్రేన్ సమస్య మరింత పెరుగుతుంది. రోజుకూ రెండుసార్లు కంటే ఎక్కువగా కాఫీని అస్సలు తీసుకోవద్దు. ఆల్కహాల్ తీసుకోవడం వలన మైగ్రేన్ సమస్య పెరుగుతుంది. ఇటీవల వెల్లడైన పరిశోధనల్లో ఆల్కహాల్ వలన మైగ్రేన్ మరింత ఇబ్బందిపెడుతుంది. వైన్ లో టైరమైన్.. హిస్టామిన్ వంటి రసాయనాలు కనిపిస్తాయి. అలాగే రెడ్ వైన్ లో హిస్టామిన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. జున్ను చాలా మందికి ఇష్టముంటుంది. కానీ మైగ్రేన్ సమస్య ఉన్నవారు తినకూడదు. బ్లూచీజ్, బ్రీ, చెడ్డార్, స్వి్స్, ఫెటా, మోజారెల్లా వాటిని తీసుకోవడం తగ్గించాలి. చాక్లెట్ మైగ్రేన్ సమస్యను మరించ పెంచుతుంది. ఈ సమస్య ఉన్నవారు చాక్లెట్స్ తినడం తగ్గించాలి. అలాగే.. పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ ఇందులో సిట్రస్ పండ్లను మాత్రం మైగ్రేన్ సమస్య ఉన్నవారు తినకూడదు. నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు తీసుకోవడం తగ్గించాలి. స్వీట్స్ తీసుకోవడం తగ్గించాలి. డైకట్ కోక్.. ఇతర క్యాలరీలు లేని డ్రింక్స్ లో సాధారణంగా కనిపించే అస్పర్టమే వంటి కృతిమ స్వీటెనర్లు మైగ్రేన్ తలనొప్పిని పెంచుతాయి. ఈస్ట్ అన్ని కాల్చిన వస్తువులను ఉపయోగిస్తారు. డోనట్స్, కేక్స్, బ్రెడ్ వంటి పదార్థాలు మైగ్రేన్ సమస్యను పెంచుతాయి. టైరమైన్ ఈస్ట్ లో ఎక్కువగా ఉంటుంది. వైన్, చీజ్ లో కూడా ఉంటుంది. ఇది మైగ్రేన్ సమస్యను పెంచుతుంది. అలాగే.. అవకాడో.. చికెన్..నాన్ వెజ్.. మజ్జిగ, పెరుగు.. ఖర్జూరం… అత్తిపండ్లు.. ఎండు ద్రాక్ష..డ్రైఫ్రూట్స్.. వెల్లుల్లి.. ఉల్లిపాయ.. బంగాళాదుంప చిప్స్.. పండిన అరటి.. బొప్పాయి.. రెడ్ ప్లం వంటి పండ్లు.. కివి.. పైనాపిల్.. ఎండిన చేపలు మైగ్రేన్ సమస్యను పెంచుతాయి.

Flash...   FLIPKARTలో AC లపై అదిరే ఆఫర్లు.. రూ.30,000 కంటే తక్కువకే కొనచ్చు…!

Note: – This article is based on research only. People with migraine problems should consult a doctor first

ఇవి కూడా చదవండి 

నిద్ర తక్కువైతే కనిపించే సంకేతాలివే.. ఈ లక్షణాలు ఉంటె జాగర్త

గురకే కదా అని లైట్ తీసుకోకండి.. ఈ రిస్క్ ఉందని మీరు కనీసం గెస్ కూడా చేయలేరు

మీరు తీసుకునే తేనే స్వచ్చమైనదేనా … ఇలా తెలుసుకోండి

 లిక్విడ్ డైట్.. ఆరోగ్యకరమా? హానికరమా?

జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? ..ఈ ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు?

 ఈ పండు రోజూ తింటే హార్ట్‌ అటాక్‌ రాదంట..!