phone under pillow: దిండు కింద మొబైల్ పెట్టుకుని నిద్రిస్తున్నారా.. ఎంత డేంజరో తెలుసా!!

 phone under pillow: దిండు కింద మొబైల్ పెట్టుకుని నిద్రిస్తున్నారా.. ఎంత డేంజరో తెలుసా!!


phone under pillow: టైమ్‌కి తినడం లేదు.. టైమ్‌కి పడుకోవడం లేదు.. ఇంక ఆరోగ్యం ఏం బావుంటుంది.. మొబైల్ చేతిలో ఉంటే నిద్రెందుకు పడుతుంది.. తెలిసి కూడా చేసే తప్పులే ఇవన్నీ.. కొంతమంది ఆ ఫోన్‌ని దిండుకిందో లేదా దిండు పక్కనో పెట్టుకుని నిద్రిస్తుంటారు.. ఈ అలవాటు ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. రాత్రిపూట మొబైల్ పక్కనే ఉంచుకుని నిద్రిస్తే ఇది మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని విన్నవిస్తున్నారు

క్యాన్సర్ కణితి ప్రమాదం- రాత్రిపూట మొబైల్ ఫోన్‌ను దగ్గరగా ఉంచుకుని నిద్రించే అలవాటు ప్రాణాంతకంగా మారవచ్చు. మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్, ట్యూమర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.


నిద్రలేమి సమస్య- రాత్రిపూట మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలై శరీరాన్ని నిద్రకు సిద్ధం చేస్తుంది. అయితే రాత్రిపూట మొబైల్ ఫోన్లు వాడటం వల్ల ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా ఈ హార్మోన్ సరిగా విడుదల కాక నిద్రలేమి సమస్య వస్తుంది.

శరీరంలో ఒత్తిడి హార్మోన్ స్థాయిని పెంచుతుంది – రాత్రిపూట మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. ఫోన్ వినియోగం అధికంగా ఉంటే శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్ కార్టిజోన్ స్థాయిని పెంచుతుంది. దీంతో మీరు నిద్రలో కూడా ఒత్తిడికి గురవుతారు

డిప్రెషన్- మొబైల్ ఫోన్ల నుండి వచ్చే రేడియేషన్ మెదడుపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దీని కారణంగా, మెదడు యొక్క నరాలు కుంచించుకుపోతాయి. ఆక్సిజన్ సరైన మోతాదులో మెదడుకు చేరదు.

మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం- రాత్రిపూట మొబైల్ ఫోన్ దగ్గరగా ఉంచుకుని నిద్రించడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మంచి అలవాటు అంటే అసలు బెడ్‌రూమ్‌లో మీ మొబైల్ ఉండకపోవడం.. హాల్లోనే ఉంచడం అన్ని విధాల శ్రేయస్కరం. ఆచరించడం కొంచెం కష్టమే అయినా ఆరోగ్యానికంటే ఏదీ ఎక్కువ కాదు కదా. ఆలోచిస్తే మంచిదేమో.

Flash...   Redmi Note 13 Pro సిరీస్ వస్తోంది.. ఇందులో ఎలాంటి కెమెరా ఫీచర్లు ఉండవచ్చు? పూర్తి వివరాలు మీకోసం..!

READ ALSO:

అన్నం తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందా..? తాజా పరిశోధనల్లో సరికొత్త విషయాలు..

లిక్విడ్ డైట్.. ఆరోగ్యకరమా? హానికరమా?

మీరు తీసుకునే తేనే స్వచ్చమైనదేనా … ఇలా తెలుసుకోండి

నిద్ర తక్కువైతే కనిపించే సంకేతాలివే

గోళ్ళని బట్టి ఆరోగ్యం గురించి ఇలా తెలుసుకోవచ్చు