PRC REPORT : ఎట్టకేలకు పీఆర్సీ నివేదిక బహిర్గతం

 


27శాతం ఇమ్మంటే 23తో సరి

ఎట్టకేలకు పీఆర్సీ నివేదిక బహిర్గతం

VDO.AIఐఆర్‌తో సమానంగా ఫిట్‌మెంట్‌

అదే సిఫారసు చేసిన కమిషన్‌

23 శాతమే ఇచ్చిన జగన్‌ సర్కారు

హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల్లోనూ కోత

30% కొనసాగించాలన్న పీఆర్సీ

70 ఏళ్లు దాటితే అదనపు పెన్షన్‌

మినిమమ్‌ పేస్కేలు 20 వేలుగ

రిష్ఠంగా 1.79 లక్షలు దాటొద్దు – అశుతోష్‌ కమిషన్‌ సిఫారసులు

అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు పీఆర్సీ నివేదిక బయటికి వచ్చింది. ఉద్యోగులకు అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ ఐఆర్‌తో సమానంగా 27 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సిఫారసు చేసింది. కానీ… సర్కారు 23 శాతంతో సరిపెట్టింది. అంతేకాదు… పీఆర్సీ సిఫారసులకు భిన్నంగా హెచ్‌ఆర్‌ఏ శ్లాబులనూ తగ్గించేసింది. అసలు విషయం ఏమిటంటే… ఫిట్‌మెంట్‌పై తుది నిర్ణయంలో ప్రభుత్వం  అశుతోష్‌ కమిషన్‌ను కూడా బురిడీ కొట్టించింది. ఎందుకంటే… తొలుత కమిషన్‌ 23 శాతం ఫిట్‌మెంట్‌నే సిఫారసు చేసింది. దాని ప్రకారమే వేతన స్కేల్స్‌ను తయారు చేసింది. కానీ, జగన్‌ ప్రభుత్వం 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించింది. ఐఆర్‌కంటే ఫిట్‌మెంట్‌ తక్కువ ఉండటం చరిత్రలో లేదు. వెరసి…. 27 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు జగన్‌ సర్కారు సిద్ధమైందని అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ కూడా భావించినట్లుంది.  అందుకే… తుది నివేదికలో ఫిట్‌మెంట్‌ 27 శాతం ఇవ్వాలని సిఫారసు చేసింది. ఉద్యోగులు కూడా 27 శాతం… అంతకు మించి ఫిట్‌మెంట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ… అటు కమిషన్‌ను, ఇటు ఉద్యోగులను సర్కారు బురిడీ కొట్టించింది. అంతిమంగా 23 శాతం ఫిట్‌మెంట్‌నే ప్రకటించింది. పీఆర్సీ నివేదికను తమ ముందుంచాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. జీవోల జారీ అనంతరం ఈ నివేదికను అందరికీ అందుబాటులో ఉంచుతామని ఉద్యోగ సంఘాల నేతలకు కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు శనివారం రాత్రి పొద్దుపోయాక… 11వ పీఆర్సీ పూర్తి నివేదికను సీఎ్‌ఫఎంఎస్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు.

DOWNLOAD PRC REPORTS ALL VOLUMES

Flash...   Heavy Rains in AP : ఏపీలో భారీ వర్ష సూచన - అప్రమత్తం - రాష్ట్రస్ధాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

హెచ్‌ఆర్‌ఏ తగ్గించి… విభజన తర్వాత హైదరాబాద్‌ నుంచి వచ్చిన సచివాలయం, ప్రధాన కార్యాలయాల సిబ్బందికి 30 శాతం హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలని అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ సిఫారసు చేసింది. దీనిని ప్రభుత్వం తొలుత 16 శాతానికి తగ్గించింది. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో 24 శాతానికి తీసుకొచ్చింది. అయినప్పటికీ… హెచ్‌ఆర్‌ఏలో ఆరు శాతం కోత పడినట్లే. అశుతోష్‌ కమిషన్‌ మొత్తం ఐదు శ్లాబుల్లో హెచ్‌ఆర్‌ఏను సిఫారసు చేసింది. గరిష్ఠంగా 30 శాతం… రూ.26,000గా నిర్ణయించింది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో 22 శాతం హెచ్‌ఆర్‌ఏను ఇవ్వాలని సిఫారసు చేసింది. ఈ శ్లాబులో గరిష్ఠ పరిమితి రూ.22,500 గా నిర్ణయించింది. 2 నుంచి 10 లక్షల్లోపు జనాభా ఉన్న పట్టణాలు/నగరాల్లో పనిచేసే సిబ్బందికి 20 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని సూచించింది. ఈ శ్లాబులో గరిష్ఠ పరిమితిని రూ.20,000గా నిర్ణయించింది. 50 వేల 2 లక్షల్లోపు జనాభా ఉన్న పట్టణాలకు 14.5 శాతం, గరిష్ఠ పరిమితి రూ.20వేల హెచ్‌ఆర్‌ఏను ఇవ్వాలని తీర్మానించింది. మిగిలిన ఉద్యోగులకు 12 శాతం హెచ్‌ఆర్‌ఏ సిఫారసు చేస్తూ, గరిష్ఠ పరిమితిని రూ.17,000గా నిర్ణయించింది. ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను నాలుగుకు కుదించింది. 30 శాతం శ్లాబును ఎత్తివేసింది. ప్రభుత్వం 50 లక్షలకు పైగా జనాభాగల శ్లాబులో ఢిల్లీలోని ఏపీభవన్‌, హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు, హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చిన సచివాలయ, హెచ్‌వోడీ, ఇతర కార్యాలయాల ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ నిర్ణయించింది. 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా ఉన్న నగరాల్లో, 13 జిల్లాల హెడ్‌క్వార్టర్ల పరిధిలో పనిచేసే ఉద్యోగులకు 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తోంది. 50,000 నుంచి 2 లక్షల్లోపు జనాభా ఉన్న పట్టణాల్లోని ఉద్యోగులకు 12 శాతాన్ని హెచ్‌ఆర్‌ఏగా ఇస్తున్నారు. 50 వేలలోపు జనాభా గల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు 10 శాతం హెచ్‌ఆర్‌ఏను ఇస్తున్నారు.

పీఆర్సీలోని మరిన్ని అంశాలు…

ఉద్యోగుల మినిమమ్‌ పేస్కేలు నెలకు రూ.20,000 ఉండాలి. 

Flash...   Facebook, Twitter to be blocked in India tomorrow?

గరిష్ఠ పే స్కేలు రూ.1,79,000 దాటొద్దు. 

వార్షిక ఇంక్రిమెంట్‌ 3 శాతం ఉండాలి. 

కొత్త పే స్కేళ్లు 2018 జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి.

పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను 70 ఏళ్ల నుంచి కొనసాగించాలి. రిటైర్‌మెంట్‌ సమయంలో ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ గరిష్ఠ పరిమితిని రూ.12 లక్షలనుంచి రూ.16 లక్షలకు పెంచాలి.

కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్‌ ఆఫ్‌టైమ్‌ స్కేలు వర్తింపజేయాలి. అదే ఇప్పుడు కొత్త వేతన స్కేలు అవుతుంది. 

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 30 శాతం వరకు స్కేలు పెంచాలి. 

ఫుల్‌టైమ్‌ కంటింజెంట్‌/డెయిలీ వేజ్‌, ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులకు వేతనం రూ.20,000కు పెంచాలి. దీనికి డీఏ అదనం.