Rain Update: నేటి నుంచి మూడు రోజులు వర్షాలు.. ఏ జిల్లాపై ఎంత ప్రభావం అంటే..?
ఓ వైపు మాడు పగిలేలా ఎండలు మండిపోతున్నాయి. అసలు బయటకు వెళ్లాలి అంటేనే భానుడి భగభగలు భయపెడుతున్నాయి. ఇదే సమయంలో మూడు రోజుల పాటు వర్షాలు అంటూ వతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో వాయు గుండం ఈ రోజు అల్ప పీడనంగా మారిందని వివరించింది.
JOBS: SSC Recruitment 2022 Out – 3603 Multi Tasking Staff, Havildar posts
ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం నుంచి రోడ్డుపై అడుగు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. భానుడి భగ భగలకు మాడు పగిలిపోతోంది. ఇలాంటి సమయంలో వర్షాలు అంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది
తాజా అల్ప పీడనం ప్రభావంతో కోస్తా ప్రాంతంతో పాటు రాయలసీమలోనూ నేడు, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మూడు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది.
కేవలం వర్షాలు మాత్రమే కాదు.. ఈ రోజు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే స్వల్పంగా ఈదురు గాలులు కూడా వీసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎండతో పాటు వానలు అంటే కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
టెన్త్, డిగ్రీ అర్హతతో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు
అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉన్న తీవ్ర వాయుగుండం బలహీన పడింది. ఈరోజు ఆ వాయుగుండం అల్పపీడనంగా మారింది. మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మరింతగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దీంతో.. ఆంధ్రప్రదేశ్, యానంలోని దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో రాగల మూడు రోజుల వరకు వాతావరణ చల్లబడే అవకాశముంది.
రాయలసీమలో ఈ రోజు రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. అయితే వర్షాలు పడినా.. ఎండలు మాత్రం తగ్గే అవకాశం లేదు.. ఉదయం ఏడు గంటల నుంచి ఉక్కపోత మాత్రం చంపేస్తుంది.
రాయలసీమలో ఈ రోజు రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. అయితే వర్షాలు పడినా.. ఎండలు మాత్రం తగ్గే అవకాశం లేదు.. ఉదయం ఏడు గంటల నుంచి ఉక్కపోత మాత్రం చంపేస్తుంది.