Sleep Attack: స్లీప్ అటాక్.. ఈ వ్యాధి చాలా డేంజర్ గురూ.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..!
Sleep Attack: ఆధునిక జీవితంలో మారిన జీవనశైలి కారణంగా చాలామంది నిద్ర సమస్యలని ఎదుర్కొంటున్నారు. మార్చి 18న ప్రపంచ నిద్ర దినోత్సవంగా ప్రకటించారు. వరల్డ్ స్లీప్ సొసైటీ ప్రకారం.. కనీసం 35 శాతం మంది సరైన నిద్ర లేకపోవడం వల్ల శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. 2021లో నిర్వహించిన స్లీప్ సర్వే ప్రకారం.. భారతదేశంలో 25 శాతం మంది ప్రజలు నిద్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీనివల్ల బీపీ, గుండె, మానసిక ఒత్తిడి వంటి జబ్బులను ఎదుర్కొంటున్నారు. కరోనా కాలంలో నిద్ర బాధితులు చాలామంది పెరిగిపోయారు. వైద్యుల ప్రకారం.. నిద్రకు సంబంధించిన ఇటువంటి వ్యాధిని వైద్య పరిభాషలో నార్కోలెప్సీ అంటారు. నార్కోలెప్సీ అనేది నిద్రకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనిని స్లీప్ అటాక్ అని కూడా అంటారు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే.. ఒక వ్యక్తి మేల్కొన్నప్పుడు చాలా అలసిపోయినట్లు కనిపిస్తాడు. ఈ కారణంగా వెంటనే మళ్లీ నిద్రపోతాడు. దీనితో బాధపడుతున్న వ్యక్తి రోజుకు చాలా సార్లు నిద్రపోతాడు. అతని మెదడు సాధారణ నిద్ర, మేల్కొనే స్థితికి అనుగుణంగా పనిచేయదు. ఈ పరిస్థితిలో కొన్నిసార్లు నిద్రలో పక్షవాతం కూడా సంభవిస్తుంది. దీంతో చాలాసార్లు ఉదయం లేచిన తర్వాత ఏమీ మాట్లాడలేకపోతారు.
వైద్యుల ప్రకారం.. ఈ వ్యాధి సరైన నిద్రలేని కారణంగా వస్తుంది. అయితే చాలా సందర్భాలలో ఇది నరాల సమస్యకి కూడా దారి తీస్తుంది. ఎవరైనా ఈ వ్యాధి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే న్యూరాలజీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఈ వ్యాధికి చికిత్స లేదు కానీ దాని లక్షణాలు, ప్రభావాలను మందుల ద్వారా తగ్గించవచ్చు.
ప్రస్తుతం చాలా మంది యువతలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఎదురవుతుంది. దీని ప్రకారం ఒక వ్యక్తి రాత్రి నిద్రిస్తున్నప్పుడు కొంత సమయం పాటు శ్వాస తీసుకోవడంలో అంతరాయాన్ని పొందుతాడు. ఈ సమస్య కొన్ని సెకన్ల నుంచి 1 నిమిషం వరకు ఉంటుంది. ఊబకాయంతో బాధపడేవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి చాలా సంవత్సరాలు కొనసాగితే అది చాలా ప్రమాదకరంగా మారుతుంది.
READ ALSO:
అన్నం తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందా..? తాజా పరిశోధనల్లో సరికొత్త విషయాలు..
లిక్విడ్ డైట్.. ఆరోగ్యకరమా? హానికరమా?
మీరు తీసుకునే తేనే స్వచ్చమైనదేనా … ఇలా తెలుసుకోండి
నిద్ర తక్కువైతే కనిపించే సంకేతాలివే