SUKANYA SAMVRUDDI YOJANA: సుకన్య సమృద్ధి యోజన, NPS, PPF ఖాతాదారులు అలర్ట్‌.

 సుకన్య సమృద్ధి యోజన, NPS, PPF ఖాతాదారులు అలర్ట్‌.. ఈ పనిచేయకపోతే ఏప్రిల్‌ 1 నుంచి అకౌంట్లు క్లోజ్..!

PPF, NPS, SSY: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాదారులు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. వాస్తవానికి మీ ఖాతా సక్రియంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఖాతాదారులు ఆర్థిక సంవత్సరంలో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మార్చి 31 నాటికి కచ్చితంగా మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెన్స్‌ చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఈ ఖాతాలను తనిఖీ చేయకుంటే ఈరోజే తనిఖీ చేయండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాతాలలో ఎలాంటి డబ్బును జమ చేయకుంటే మార్చి 31, 2022లోగా తప్పనిసరిగా కనీస మొత్తాన్ని జమ చేయండి. లేదంటే జరిమానా చెల్లించవలసి ఉంటుంది. వాస్తవానికి ఈ ఖాతాలు ఒకసారి డీయాక్టివేట్ అయితే వాటిని మళ్లీ యాక్టివేట్ చేయడానికి మీరు జరిమానా చెల్లించాలి

PPFలో డిపాజిట్ చేయవలసిన కనీస మొత్తం

ఒక ఆర్థిక సంవత్సరానికి PPFలో కనీస వార్షిక సహకారం రూ. 500. ఈ మొత్తం జమచేయడానికి చివరి తేదీ మార్చి 31, 2022 అని తెలుసుకోండి. ఇప్పటివరకు డబ్బులు డిపాజిట్ చేయకపోతే, వెంటనే చేయండి. లేకపోతే మీరు ప్రతి సంవత్సరం రూ. 50 జరిమానాతో పాటు సంవత్సరానికి రూ. 500 బకాయి చందా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఖాతా మూసివేస్తే మీకు ఎటువంటి రుణం లభించదు.

ALSO READ:

 SBI ఖాతాదారులకు స్పెషల్ ఆఫర్

SBI Alert: ఖాతాదారులకు SBI హెచ్చరిక.. 

SBI YONO: పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకుగా SBI YONO యాప్..!

NPSలో డిపాజిట్ చేయవలసిన కనీస మొత్తం

నిబంధనల ప్రకారం.. టైర్-I NPS ఖాతాదారులు ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,000 డిపాజిట్ చేయడం తప్పనిసరి. ఈ సమయంలో NPS టైర్-I ఖాతాలో కనీస మొత్తం జమ చేయకపోతే ఖాతా నిష్క్రియంగా మారుతుంది. ఇందుకోసం రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఒకరికి టైర్ II ఎన్‌పిఎస్ ఖాతా ఉంటే టైర్-I ఖాతా ఫ్రీజింగ్‌తో పాటు, టైర్-II ఖాతా కూడా ఆటోమేటిక్‌గా క్లోజ్‌ అవుతుందని తెలుసుకోండి.

Flash...   APPSC: గుడ్ న్యూస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ,గ్రూప్ 2 నోటిఫికేషన్లు - పోస్టులు ఇలా..!

సుకన్య సమృద్ధి యోజన ఖాతా పథకం

సుకన్య సమృద్ధి ఖాతాలో ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 డిపాజిట్ చేయడం తప్పనిసరి. లేదంటే దీనికి రూ.50 జరిమానా విధిస్తారు. ఈ పరిస్థితిలో మీరు కనీస మొత్తాన్ని జమ చేయకుంటే ఈరోజే జమ చేయండి.

ALSO READ:

APGLI Final Payment Calculator

ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా? ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్!

SBI CLERKS , PO పోస్టులకు నోటిఫికేషన్‌.. అర్హత, దరఖాస్తు వివరాలివే

సున్నా రూపాయి నోటు ఉందని మీకు తెలుసా? ఎందుకో తెలుసా