అసలు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఎందుకు మూసేశారు…

 KGF 2: కేజీఎఫ్‌లో ఎంత బంగారం వెలికి తీశారో తెలుసా…అసలు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఎందుకు మూసేశారు…


KGF 2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజై అద్భుతమైన హిట్ అందుకుంది. వసూళ్ల పరంగా ఈ  చిత్రం మొదటి భాగం కన్నా కూడా రెండో భాగం రికార్డులను తిరగ రాస్తోంది. అయితే ఈ నేపథ్యంలో కాల గర్భంలో కలిసి పోయిన కోలార్ బంగారు గనుల గురించి దేశ వ్యాప్తంగా చర్చ మరోసారి మొదలైంది. అసలు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ చరిత్ర ఏంటి…ఆ గనులు ప్రస్తుతం మైనింగ్ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకుందాం. 

కర్ణాటకలోని దక్షిణ కోలార్ జిల్లాలో రాబర్ట్‌సన్‌పేట్ తహసీల్ సమీపంలో ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో 121 ఏళ్ల పాటు మైనింగ్ నడిచింది.  ఈ బంగారు గని నుంచి 900 టన్నుల బంగారాన్ని వెలికితీశారని ఒక అంచనా ఉంది. ఈ గని 2001లో మూతపడింది

READ ‘K.G.F’ అసలు కథ ఏంటంటే.. ఆ గనులు ఇప్పుడెక్కడ?

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పేరుతో ఉన్న ఈ బంగారు గని ప్రపంచంలోని లోతైన బంగారు గనులలో ఒకటి. ఈ గని లోతు 3.2 కి.మీ.అని ఒక అంచనా. చారిత్రక ఆనవాళ్ల ప్రకారం 1799 సంవత్సరంలో శ్రీరంగపట్నం యుద్ధంలో నాటి మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోగా, ఆయన నుంచి కోలార్ గనులు స్వాధీనం చేసుకున్నారు

121 ఏళ్లలో 900 టన్నుల బంగారం వెలికి తీశారు

తొలుత  1802 లో కెప్టెన్ వారెన్ అను బ్రిటీష్ వ్యక్తికి కోలార్ బంగారు గనుల తవ్వకాలకు అనుమతి లభించింది. అయితే ఇక్కడ అనుకున్నంత స్థాయిలో బంగారం లభించకపోవడంతో అతను వదులుకున్నాడు. తర్వాత ఎం.ఎఫ్. లావెల్లీ అనే బ్రిటీషర్ మరోసారి గనుల తవ్వకానికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. 1875 లో అనుమతి మంజూరైంది. అప్పటి నుంచి ఈ గని కమర్షియల్ గా నడుస్తోంది. 

భారత ప్రభుత్వం 1956లో గనులను స్వాధీనం చేసుకుంది. 1970లో కేజీఎఫ్‌ మైన్స్ ను భారత్ గోల్డ్ మైన్స్‌ పేరిట ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసి అప్పగించింది. నివేదిక ప్రకారం, ఈ గని నుండి 121 సంవత్సరాలుగా 900 టన్నులకు పైగా బంగారాన్ని వెలికితీశారు. ఆర్థిక కారణాల దృష్ట్యా 28 ఫిబ్రవరి 2001న వాటిని భారత ప్రభుత్వం మూసివేసింది. భూమిలో చేతులు పెట్టి బంగారం తీసేవారు.

Flash...   కార్ల వెనుక ఉండే Lxi, Zxi, LDi, ZDi, CVT అనే అక్షరాలు అర్ధాలు తెలుసా .?

స్వతంత్రం వచ్చే వరకూ బ్రిటీష్ పాలకులు కోలార్‌లోని బంగారు గనుల ప్రాంతాన్ని తమ వద్దే ఉంచుకున్నారు. మిగిలిన భూమిని మైసూర్ రాష్ట్రానికి ఇచ్చారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం,చోళ సామ్రాజ్యంలోని ప్రజలు కోలారు భూమిలో చేతులు పెట్టి బంగారాన్ని వెలికితీసేవారని శాసనాల్లో రాసుకున్నారు. గ్రామస్తులు కోలారు ప్రాంతంలోని మట్టిని నీటితో కడిగినప్పుడు బంగారు రేణువులు కనిపించేవని శాసనాల్లో ఉంది. .

బ్రిటిష్ వారు KGF ని మినీ ఇంగ్లాండ్ అని పిలిచేవారు


1901- 1910 మధ్యకాలంలో ఈ గనులనుండి రికార్డు స్థాయిలో ముడి ఖనిజాన్ని వెలికితీశారు.ఆధునిక యంత్రాలతో కోలారులో మైనింగ్ ప్రారంభం అయ్యాక భారీ మొత్తంలో బంగారం వెలికితీయడం ప్రారంభించారు. బ్రిటీష్ వారికి కోలారు ప్రాంతం ఎంతగానో నచ్చింది, వారు అక్కడ ఇళ్లను నిర్మించడం ప్రారంభించారు. ఒక విధంగా, KGF బ్రిటిష్ వారి నివాసాలతో  మినీ ఇంగ్లండ్‌గా మారింది.1930 నాటికి దాదాపు 30 వేల మంది కూలీలు కెజిఎఫ్‌లో పని చేశారని ఒక అంచనా ఉంది.