Aadhaar Card: మీ ఆధార్‌ కార్డు విషయంలో ఏదైనా మోసం జరిగిందా..? ఇలా తెలుసుకోండి

 Aadhaar Card: మీ ఆధార్‌ కార్డు విషయంలో ఏదైనా మోసం జరిగిందా..? సింపుల్‌ ఇలా తెలుసుకోండి


Aadhaar Card: ఆధార్‌ కార్డు అనేది నేటి కాలంలో ఎంతో ముఖ్యమైనది. ఇది లేనిది ఏ పనులు జరగని పరిస్థితి ఉంది. ఇప్పుడు పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా ఆధార్ కార్డు ముఖ్యమైపోయింది. మీ బిడ్డకు ఆధార్ కార్డు లేకపోతే, పాఠశాలలో అడ్మిషన్ సమయంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇది కాకుండా మీ పిల్లలు ఆధార్ లేకుండా ఏ ప్రభుత్వ పథకాన్ని ఉపయోగించలేరు. ఆధార్‌కు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, దాని దుర్వినియోగం ప్రమాదం కూడా పెరుగుతుంది. కానీ ఆధార్‌తో ఉన్న ఒక ఉత్తమమైన విషయం ఏమిటంటే మీరు దానిని ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించారు అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. 

READ: మీ ఆధార్‌కు ఏ మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేశారో సులభంగా తెలుసుకోవచ్చు..!

ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తమ ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తారేమోనని చాలా మంది భయపడుతున్నారు. మీకు ఆధార్ కార్డ్ భద్రత, దుర్వినియోగం గురించి కూడా ఆందోళనలు ఉంటే మీరు ఆధార్ వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా గత 6 నెలల్లో ఆధార్‌ కార్డును ఎక్కడెక్కడ వినియోగించారనే విషయాన్ని తెలుసుకోవచ్చు. UIDAI వెబ్‌సైట్‌లో మీ ఆధార్ వినియోగం ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించబడింది అనే పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.

మన ఆధార్‌ కార్డును ఇతర వ్యక్తులు నకిలీ ఆధార్‌ కార్డును సృష్టించి వాడుకుంటున్నారు. ఇలాంటి మోసాలు కూడా ఇప్పటి వరకు పోలీసులు ఎన్నో బయట పెట్టారు. ఒకవేల మీ ఆధార్ కార్డు ఎవరైన వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఇక అంతే సంగతులు. అందుకే మన ఆధార్‌ కార్డును ఎవరైనా వాడుతున్నారా?, వారు మన కార్డును ఎక్కడైనా ఉపయోగించారా..? అనే విషయాన్ని తెలుసుకునేందుకు యూఐడీఏఐ (UIDAI) అవకాశం కల్పిస్తోంది. కొన్ని మార్గాలను ఉపయోగించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకునే వెసులుబాటు కల్పించింది యూఐడీఏఐ.

READ: How to get Adhar PVC card online

Flash...   iPhone Offer: 20 వేలు ఉంటే చాలు ఐఫోన్ మీసొంతం.. ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ డీల్..

☛ ముందుగా ఆధార్ అధికారిక యూఐడీఏఐ పోర్టల్ ఓపెన్ చేయండి వెళ్లాలి.

☛ తర్వాత మై ఆధార్‌ సెక్షన్‌లోకి వెళ్లి ఆధార్‌ సర్వీసెస్‌ను ఎంపిక చేసుకోవాలి.

☛ ఇక ఆధార్‌ సర్వీస్‌ సెక్షన్‌లో 8వ వరుసలో కనిపించే ఆధార్‌ అథెంటికేషన్‌ హిస్టరీపై క్లిక్‌ చేయాలి.

☛ ఇప్పుడు ఆధార్‌ నెంబర్‌, క్యాప్చా ఎంటర్‌ చేసి సెండ్‌ ఓటీపీపై క్లిక్‌ చేయాలి.

☛ ఎప్పటి నుంచి హిస్టరీ కావాలో ఎంచుకుని తేదీ, నెల, సంత్సరం ఎంటర్‌ చేయాలి.

READ: How to Link Aadhaar with Bank Account for AMMA VODI

☛ ఇక్కడ ఆరు నెలలకు సంబంధించిన సమాచారం మాత్రమే వస్తుంది.

☛ ఆ తర్వాత మీ ఆధార్‌కు లింక్‌ అయి ఉన్న ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. తర్వాత దానిని ఎంటర్‌ చేయాలి.

☛ ఇప్పుడు మీరు ఏ సమయంలో, ఎక్కడ ఉపయోగించారో పూర్తి వివరాలు తెలిసిపోతాయి.

☛ ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే కచ్చితంగా మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకు లింకు అయి ఉండాలి. దీని తర్వాత, మీ ఆధార్ కార్డ్ ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించబడింది అనే సమాచారం మీ ముందుకు వస్తుంది.

ADHAR WEBSITE

DOWNLOAD YOUR ADHAR CARD

UPDATE YOUR ADHAR

ALSO READ:

 మీ ఆధార్ కార్డు కి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ లింక్ అయ్యాయో ఇక్కడ తెలుసుకోండి

అమ్మ ఒడి కి సంబంధించి తాజా అకౌంట్ అప్డేట్.

GPS తోనే ఉద్యోగులకు మెరుగైన పెన్షన్‌