AP Cabinet 2.0: సీఎం జగన్ కొత్త కేబినెట్ ఇదే.. కొత్తగా వచ్చేదెవరు? సెకెండ్ ఛాన్స్ ఎవరికి? ఫైనల్ లిస్ట్ ఇదే..!

 AP Cabinet 2.0: సీఎం జగన్ కొత్త కేబినెట్ ఇదే.. కొత్తగా వచ్చేదెవరు? సెకెండ్ ఛాన్స్ ఎవరికి? ఫైనల్ లిస్ట్ ఇదే..!


AP Cabinet 2.0: సీఎం జగన్ (CM Jagan) 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తన జంబో కేబినెట్(Jambo Cabinet) ను సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం మంత్రులందరితో మూకుమ్మడి రాజీనామాలు చేయించిన సీఎం.. మొదట ఒకరిద్దర్ని తప్పా మిగిలిన వారిని మాజీలు చేయాలని భావించినా.. చివరి క్షణంలో మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అందుకే రెండు రోజుల పాటు సుదీర్ఘ కసరత్తు తరువాత.. పాత కొత్తల కలయికతో జంబో కేబినెట్ ను సిద్ధం చేస్తున్నారు.   ఎల్లుండి ఉదయం 11 గంటల 31 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు సైతం చకచకా సాగుతున్నాయి. కొత్త మంత్రులతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ (Governor Bishwabushan Harichandhan) ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. అయితే జగన్‌ కేబినెట్‌ 2.0 ఎలా ఉండబోతోంది? కొత్త మంత్రుల్లో ఎవరెవరు ఉండబోతున్నారు? పాత మంత్రుల్లో ఎంతమందిని కొనసాగించబోతున్నారు? అన్న అంశం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

అధికారికంగా అయితే కొత్త మంత్రుల జాబితీ రేపు మధ్యాహ్నానానికి గవర్నర్ కు అందుతుందని తెలుస్తోంది. ఆయనకు లిస్టు చూపించి.. ఆమోద ముద్ర వేయించిన తరువాత.. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోబోయే వారికి సీఎం జగన్‌ స్వయంగా ఫోన్‌ చేసి ఆ విషయం చెప్పబోతున్నారని తెలుస్తోంది. అయితే ఆశావాహులు మాత్రం ఇప్పటికే ఇప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ చేరుకున్నట్లు తెలుస్తోంది. వారంతా కచ్చితంగా తమకు మంత్రి పదవి ఖాయమైందనే నమ్మకంతో ఉన్నారు.

మొదట అనుకున్నదాని కంటే.. సెకెండ్ ఛాన్స్ దక్కించుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా 2024 ఎన్నికలపైన సీఎం జగన్ ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాను పార్టీని పట్టించుకోకుండా.. పాలనకే సమయం వెచ్చిస్తే ప్రమాదం తప్పదని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే మొదట ఇద్దరు ముగ్గురు అనుకున్న జాబితాను 10కి పైగా పెంచారు. అనుభవం పేరుతో కొంతమంది మరోసారి ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. తాను పార్టీ కార్యక్రమాలు.. బలోపేతంపై ఫోకస్ చేస్తే.. పాలన చూసుకోవడానికి సీనియర్ల అవసరం ఉందని ఆయన నిర్ణయానికి వచ్చారు.

Flash...   GO RT 4 Dt: 25.09.2020: Sanction of Maternity Leave for (180) days with full pay to Employees working in the Village / Ward Secretariats

పాత మంత్రుల జాబితాను పెంచారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న బొత్స (Botsa), పెద్దిరెడ్డి (Peddireddy), కొడాలి నాని (Kodali Nani), బుగ్గన (Buggana) , పేర్ని నాని (Perni Nani), అనిల్ (Anil), బాలినేని (Balineni), కన్నబాబు (Kannababu)లను అనుభవం ప్రకారం కొనసాగించే అవకాశం ఉంది. అలాగే సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రులు జయరామ్ (Jayaram), వేణుగోపాల్ (Venugopal), అప్పలరాజు (Appalaraju), సురేష్ (Suresh), అంజాద్ బాషా (Amzad Bhasa), శంకర్ నారాయణ (sankar Narayan), తానేటి వనిత (Taneti Vanitha)ను కొత్త కేబినెట్‌లోకి తీసుకుంటారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇక కొత్త మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోందో చూస్తే.. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు (Darmnana Prasada Rao)కు కచ్చితంగా ఛాన్స్‌ ఇస్తారని సమాచారం. సాలూరు నుంచి రాజన్నదొర (Rajanna Dora), పాడేరు నుంచి భాగ్యలక్ష్మి (Bhagya Laxmi), అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాధ్ (Amarnath), తుని నుంచి దాడిశెట్టి రాజా (D Raja), పి.గన్నవరం నుంచి చిట్టిబాబు (Chittibabu), తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు (Nageswara Rao)కు జగన్‌ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలున్నాయి. అటు భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ (G Srinivas)‌, పెడన నుంచి జోగి రమేశ్ (Jogi Ramesh)‌, చిలకలూరిపేట నుంచి విడదల రజిని (Vidudala Rajani), తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి (Rakhsana Nidhi), వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున I(V Nagarjuna) కూడా కొత్త కేబినెట్‌లో ఉంటారన్న టాక్‌ వినిపిస్తోంది. ఇక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhana Reddy)తో పాటు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి (J Padmavathi), శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి (Shilpa Chakrapani Reddy), రైల్వేకోడూర్‌ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు (Korumutla Srinivasulu)కు కూడా జగన్‌ కేబినెట్‌లో చోటు ఖాయమని సమాచారం అయితే చివరి నిమిషంలో ఏమైనా మార్పులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

కొత్తగా కేబినెట్ లో చేరేది వీరే..!

Flash...   AP CABINETMEET: రేపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినేట్ భేటీ

ధర్మాన ప్రసాదరావు – శ్రీకాకుళం – బీసీ వెలమ

రాజన్నదొర- సాలూరు- ఎస్టీ

భాగ్యలక్ష్మి- పాడేరు- ఎస్టీ

గుడివాడ అమర్నాధ్- అనకాపల్లి- కాపు

దాడిశెట్టి రాజా – తుని-కాపు

చిట్టిబాబు- పి.గన్నవరం- ఎస్సీ ( మాల)

కారుమూరి నాగేశ్వరరావు- తణుకు- బీసీ

గ్రంథి శ్రీనివాస్‌- బీమవరం-కాపు

జోగి రమేశ్‌- పెడన – బీసీ

విడదల రజని- చిలకలూరిపేట- బీసీ

మేరుగ నాగార్జున- వేమూరు- ఎస్సీ ( మాల)

కాకాని గోవర్థన్‌రెడ్డి- సర్వేపల్లి – రెడ్డి

జొన్నలగడ్డ పద్మావతి- శింగనమల- ఎస్సీ ( మాల)

శిల్పా చక్రపాణిరెడ్డి- శ్రీశైలం- రెడ్డి

కోరుముట్ల శ్రీనివాస్‌- రైల్వేకోడూర్‌- ఎస్సీ ( మాల)

రక్షణ నిధి- తిరుపూరు- ఎస్సీ మాదిగ