అమరావతి: పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 4న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త జిల్లాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలనే జిల్లాల్లో మార్పులు చేశామని.. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు అవసరమని జిల్లాల ప్రారంభోత్సవం సమయంలో సీఎం జగన్ చెప్పారు. ఈ క్రమంలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. తాజాగా జిల్లాల ఇంఛార్జిలను నియమించింది. ఒక్కో మంత్రిని ఒక్కో జిల్లా ఇంఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలు.. ఇంఛార్జి మంత్రులు..
➧ గుంటూరు – ధర్మాన ప్రసాదరావు
➧ కాకినాడ – సీదిరి అప్పలరాజు
➧ శ్రీకాకుళం – బొత్స సత్యనారాయణ
➧ అనకాపల్లి – పీడిక రాజన్న దొర
➧ అల్లూరి, పార్వతీపురం మన్యం- గుడివాడ అమర్‌నాథ్
➧ విజయనగరం – బూడి ముత్యాలనాయుడు
➧ పశ్చిమ గోదావరి – దాడిశెట్టి రాజా
➧ ఏలూరు – పినిపే విశ్వరూప్
➧ తూర్పు గోదావరి – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
➧ NTR జిల్లా – తానేటి వనిత
➧ పల్నాడు జిల్లా – కారుమూరు నాగేశ్వరరావు
➧ బాపట్ల – కొట్టు సత్యనారాయణ
➧ అమలాపురం కోనసీమ – జోగి రమేష్
➧ ప్రకాశం – మేరుగ నాగార్జున
➧ విశాఖ – విడదల రజని
➧ నెల్లూరు – అంబటి రాంబాబు
➧ YSR జిల్లా – ఆదిమూలపు సురేష్
➧ అన్నమయ్య – కాకాణి గోవర్ధన్ రెడ్డి
➧ అనంతపురం – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
➧ కృష్ణా – రోజా
➧ తిరుపతి – నారాయణస్వామి
➧ నంద్యాల – అంజాద్ బాష
➧ కర్నూలు – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
➧ శ్రీసత్యసాయి – గుమ్మనూరు జయరాం
➧ చిత్తూరు – ఉషశ్రీచరణ్