BOB : డెబిట్ కార్డు లేకుండానే డబ్బులు డ్రా.. ప్రొసీజర్ ఏమిటి?
ఇటీవల కాలంలో చాలా బ్యాంకులు ఏటీఎం కార్డు లేదా డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ సర్వీసును కార్డులెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌గా పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో భాగంగానే ప్రభుత్వ రంగానికి చెందిన Bank Of Baroda కూడా ఏటీఎం కార్డు లేదా డెబిట్ కార్డు లేకుండానే క్యాష్ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని అనుమతిస్తోంది. ఒకవేళ మీరు బ్యాంకు ఆఫ్ బరోడా కస్టమర్ అయితే ఈ సౌకర్యానికి బ్యాంకు క్యాష్ ఆన్ మొబైల్ అనే పేరు పెట్టింది. దీని కోసం మీ మొబైల్‌లో M-Connect Plus యాప్‌ను వేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా దేశంలో బ్యాంకు ఆఫ్ బరోడాకు చెందిన ఈ ATM నుంచైనా మనీని విత్ డ్రా చేసుకోవచ్చు.
క్యాష్ ఆన్ మొబైల్ సర్వీసులను ఎలా వాడుకోవాలి..?
బ్యాంకు ఆఫ్ బరోడా కస్టమర్లు బీఓబీకి చెందిన M-Connect Plus App ను ఓపెన్ చేయాలి. కార్డు రహిత లావాదేవీల కోసం ఓటీపీని జనరేట్ చేయాలి. దీని కోసం కస్టమర్లు తొలుత..M-Connect Plus App లోకి లాగిన్ అయి, ప్రీమియం సర్వీసెస్ ట్యాబ్‌పై ట్యాప్ చేయాలి
ఆ తర్వాత క్యాష్ ఆన్ మొబైల్ సర్వీసుపై క్లిక్ చేయాలి.
అకౌంట్ నెంబర్‌ను, మొత్తాన్ని నమోదు చేసి, సబ్‌మిట్ చేయాలి.
రిక్వెస్ట్ సబ్‌మిట్ అయిన తర్వాత.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి బ్యాంకు ఓటీపీ పంపుతుంది
ఈ ఓటీపీని తీసుకుని దగ్గర్లోని బ్యాంకు ఆఫ్ బరోడా ఏటీఎంకి వెళ్లాలి. ఏటీఎం స్క్రీన్‌పై క్యాష్ ఆన్ మొబైల్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌కి వచ్చిన ఓటీపీని నొక్కి, మీకు డ్రా చేసుకోవాల్సిన మొత్తాన్ని నమోదు చేయాలి. ఇలా మీకు అవసరమైన మనీని డెబిట్ కార్డు లేకుండానే దగ్గర్లోని బీఓబీ ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు.
ALSO READ:
SBI Youth for India Fellowship 2022: నెలకు రూ.16,000 స్టైపెండ్.. రూ.50,000 అలవెన్స్
సుకన్య సమృద్ధి యోజన, NPS, PPF ఖాతాదారులు అలర్ట్.
SBI Jobs 2022: Upcoming SBI CLERKS , PO పోస్టులకు నోటిఫికేషన్