Cardless withdrawals: డెబిట్ కార్డు లేకుండానే డబ్బులు డ్రా

 BOB : డెబిట్ కార్డు లేకుండానే డబ్బులు డ్రా.. ప్రొసీజర్ ఏమిటి?


ఇటీవల కాలంలో చాలా బ్యాంకులు ఏటీఎం కార్డు లేదా డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ సర్వీసును కార్డులెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌గా పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో భాగంగానే ప్రభుత్వ రంగానికి చెందిన Bank Of Baroda కూడా ఏటీఎం కార్డు లేదా డెబిట్ కార్డు లేకుండానే క్యాష్ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని అనుమతిస్తోంది. ఒకవేళ మీరు బ్యాంకు ఆఫ్ బరోడా కస్టమర్ అయితే ఈ సౌకర్యానికి బ్యాంకు క్యాష్ ఆన్ మొబైల్ అనే పేరు పెట్టింది. దీని కోసం మీ మొబైల్‌లో M-Connect Plus యాప్‌ను వేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా దేశంలో బ్యాంకు ఆఫ్ బరోడాకు చెందిన ఈ ATM నుంచైనా మనీని విత్ డ్రా చేసుకోవచ్చు.

క్యాష్ ఆన్ మొబైల్ సర్వీసులను ఎలా వాడుకోవాలి..?

బ్యాంకు ఆఫ్ బరోడా కస్టమర్లు బీఓబీకి చెందిన M-Connect Plus App ను ఓపెన్ చేయాలి. కార్డు రహిత లావాదేవీల కోసం ఓటీపీని జనరేట్ చేయాలి. దీని కోసం కస్టమర్లు తొలుత..M-Connect Plus App లోకి లాగిన్ అయి, ప్రీమియం సర్వీసెస్ ట్యాబ్‌పై ట్యాప్ చేయాలి

ఆ తర్వాత క్యాష్ ఆన్ మొబైల్ సర్వీసుపై క్లిక్ చేయాలి.

అకౌంట్ నెంబర్‌ను, మొత్తాన్ని నమోదు చేసి, సబ్‌మిట్ చేయాలి.

రిక్వెస్ట్ సబ్‌మిట్ అయిన తర్వాత.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి బ్యాంకు ఓటీపీ పంపుతుంది

ఈ ఓటీపీని తీసుకుని దగ్గర్లోని బ్యాంకు ఆఫ్ బరోడా ఏటీఎంకి వెళ్లాలి. ఏటీఎం స్క్రీన్‌పై క్యాష్ ఆన్ మొబైల్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌కి వచ్చిన ఓటీపీని నొక్కి, మీకు డ్రా చేసుకోవాల్సిన మొత్తాన్ని నమోదు చేయాలి. ఇలా మీకు అవసరమైన మనీని డెబిట్ కార్డు లేకుండానే దగ్గర్లోని బీఓబీ ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు.

Flash...   Philately scholarship Scheme “ Deen Dayal SPARSH Yojana

ALSO READ: 

SBI Youth for India Fellowship 2022: నెలకు రూ.16,000 స్టైపెండ్‌.. రూ.50,000 అలవెన్స్‌

సుకన్య సమృద్ధి యోజన, NPS, PPF ఖాతాదారులు అలర్ట్‌.

SBI Jobs 2022: Upcoming SBI CLERKS , PO పోస్టులకు నోటిఫికేషన్‌