CARONA DANGER BELLS AGAIN :కరోనా మళ్లీ కోరలు చాస్తోంది… 12 రాష్ట్రాల్లో రెట్టింపైన కరోనా కేసులు!

 కరోనా మళ్లీ కోరలు చాస్తోంది… 12 రాష్ట్రాల్లో రెట్టింపైన కరోనా కేసులు!

గత 24 గంటల్లో 2,541 కేసుల నమోదు

కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,862

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,522

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ప్రతి రోజు 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 12 రాష్ట్రల్లో వారం రోజుల నుంచి కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముందు వారంతో పోలిస్తే ఈ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రెట్టింపయింది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. 

గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3.02 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 2,541 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 1,862 మంది మహమ్మారి నుంచి కోలుకోగా… 30 మంది మృతి చెందారు. తాజా మృతులతో కలిపి ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 5,22,223కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 16,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 187 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.

Flash...   GPS బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం. గజిట్ విడుదల