CM Jagan: అవినీతిపై ఫిర్యాదుల‌కు ప్రత్యేక యాప్‌.. ఏపీ సీఎం జ‌గ‌న్

 CM Jagan: అవినీతిపై ఫిర్యాదుల‌కు ప్రత్యేక యాప్‌.. AP CM  జ‌గ‌న్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో ACB, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(CM Jagan) అధికారులను ఆదేశించారు. తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో హోం శాఖపై సీఎం సమీక్ష(Review) నిర్వహించారు. దిశ తరహాలో..

రాష్ట్రంలో ACB, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(CM Jagan) అధికారులను ఆదేశించారు. తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో హోం శాఖపై సీఎం సమీక్ష(Review) నిర్వహించారు. దిశ తరహాలో అవినీతి ఫిర్యాదులకు ఏసీబీ యాప్‌ తేవాలని సూచించారు. ఏసీబీకి యాప్‌(ACB App) ద్వారా ఆడియో ఫిర్యాదు చేయొచ్చని సీఎం అన్నారు. అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను క్లీన్‌ చేయాల్సిందేని ఆదేశించారు. నెలరోజుల్లోగా ఏసీబీ యాప్‌ రూపకల్పన జరగనుందని, నేర నిర్ధారణకు ఫోరెన్సిక్‌ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉంటుందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. డ్రగ్స్‌ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండరాదని తెలిపారు. విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. ఎస్‌ఈబీకి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబర్‌ ఉంటుందని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

అవినీతి చోటుచేసుకుంటున్న విభాగాలను క్లీన్‌ చేయాల్సిందే. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ACB కి APP తీసుకొస్తాం. నెలరోజుల్లోగా యాప్‌ రూపకల్పన చేసి, ఆడియోనూ ఫిర్యాదుగా పంపించే అవకాశం కల్పిస్తాం. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ చేస్తుంది. డగ్స్‌ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండకూడదకు. విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. ప్రతినెలా ఈ అంశాల్లో ప్రగతిని నివేదించాలి.

Flash...   Online Classes: నేటి నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన