Corona : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 23 మంది విద్యార్థులకు పాజిటివ్‌..

 Corona : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 23 మంది విద్యార్థులకు
పాజిటివ్‌..

కరోనా మహమ్మారి మళ్లీ రెక్కలు చాస్తోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది
ప్రజలపై విరుచుకుపడుతున్న కరోనా.. ఇప్పుడు మరోసారి తన ప్రభావాన్ని చూపుతోంది.
యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడి తీవ్ర అవస్థలను
ఎదుర్కొంటున్నారు. అయితే మొన్నటికి మొన్న ఒమిక్రాన్‌ రూపంలో థర్డ్‌ వేవ్‌
సృష్టించిన కరోనా.. ఇప్పుడు మరోసారి దేశంలో విజృంభిస్తోంది. దేశ రాజధాని
ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో కరోనా కేసులు వెలుగు
చూస్తున్నాయి. గడిచిన 48 గంటల్లో 53 కరోనా కేసులు నోయిడాలో నమోదయ్యాయి.

అయితే ఈ కేసులు ఎక్కువగా పాఠశాలల్లో నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం
అయితే మొత్తం నాలుగు స్కూల్‌లలోని 23 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు
నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఫస్ట్‌, ప్రైమరీ కాంటాక్టులకు కూడా
పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా
ఘజియాబాద్ స్కూల్‌లో 13 ఏండ్ల విద్యార్థికి కరోనా సోకింది. నోయిడాలోని
సెక్టార్‌ 40లోని ప్రైవేట్‌ స్కూల్‌లో 13 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లకు
కరోనా పాజిటివ్‌గా వచ్చింది.

ALSO READ: 

మండే ఎండలు.. మీకు తరచూ వేడి చేస్తుందా.. ఇదిగో టిప్స్

ఎండాకాలం ఈ జబ్బుల ప్రమాదం ఎక్కువ.. జాగ్రత్త..!

AP NEW CABINET 2.0: AP మంత్రులకు శాఖల కేటాయింపులు

మధుమేహం బారిన పడిన వారు ఎవరిని సంప్రదించాలి.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?

AP10th Class Pre-final 2022 Key Papers

దీంతో ఘజియాబాద్‌, నోయిడాలో పలు ప్రైవేట్‌ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
రెండు రోజుల పాటు భౌతిక తరగతులను రద్దు చేసి ఆన్‌లైన్‌ క్లాసులు
నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. చైనాలో సైతం కరోనా
కేసులు భారీగా పెరుగుతున్నాయి. చైనాలో అతిపెద్ద నగరమైన శాంఘై సిటీలో ఇప్పటికే
లాక్‌డౌన్ విధించారు. అంతేకాకుండా ఒమిక్రాన్‌ వేరియంట్‌లోని ఎల్‌452ఆర్‌
మ్యుటేషన్‌ కేసులు ఇప్పటికే భారత్‌లో నమోదవుతుండడం గమనార్హం.

Flash...   CARONA VACCINE : ఫేజ్‌ 1, 2 క్లినికల్‌ ట్రయల్స్‌ అంటే ఏమిటి ? తరువాత ఏం జరుగుతుంది ?