Education Loan: ఈ బ్యాంకులు చౌకైన విద్యా రుణాలు అందిస్తున్నాయి.. EMI ఎంతంటే..?

Education Loan: ఈ బ్యాంకులు చౌకైన విద్యా రుణాలు అందిస్తున్నాయి.. EMI ఎంతంటే..?

Education Loan: ఉన్నత విద్యనభ్యసించడానికి ఆర్థిక స్థోమత లేని విద్యార్థులు ఎడ్యుకేషన్‌ లోన్‌ సాయంతో చదువుకోవచ్చు. విద్యార్థులు ఈ లోన్లతో విదేశాలలో ప్రత్యేక కోర్సులని చదవవచ్చు. విద్యా రుణం పొందడం చాలా సులభం కానీ నిబంధనలు, షరతులు ఉంటాయి. మీ అవసరాలను బట్టి కోర్సు ఫీజులు, ప్రయాణ వ్యయాలను తీర్చడంలో ఇవి మీకు సహాయపడతాయి. ఇప్పుడు బ్యాంకులు విద్యా రుణాలను సులువుగా పంపిణీ చేస్తున్నాయి. అవసరమైన డాక్యుమెంట్లని సబ్‌మిట్‌ చేస్తే విద్యా రుణం పొందడం చాలా సులభం. ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేసే ముందు దానికి సంబంధించిన అర్హతలని చెక్ చేసుకోవాలి. 20 లక్షల విద్యా రుణం 7 సంవత్సరాల కాలంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

READ: SBI: ఎస్‌బీఐ నుంచి అద్భుతమైన ఛాన్స్… రూ.9,00,000 ప్రైజ్ మనీ

రుణదాతలు సాధారణంగా ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో విద్యా రుణాలను అందిస్తారు. విదేశీ కోర్సుల కోసం పొందే రుణాల వడ్డీ రేట్లు సాధారణంగా భారతీయ ఇన్‌స్టిట్యూట్‌లలో అభ్యసించే కోర్సులకు వసూలు చేసే రేటు కంటే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం రుణదాత, కోర్సు రకం, సంస్థ, విద్యా పనితీరు, అందించే భద్రత, రుణగ్రహీత/సహ-దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్ ఆధారంగా విదేశీ కోర్సులకు విద్యా రుణ వడ్డీ రేట్లు సంవత్సరానికి 8 శాతం నుండి ప్రారంభమవుతాయి. చౌకైన విద్యా రుణాలు అందించే బ్యాంకుల గురించి తెలుసుకుందాం.

READ SBI బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రూ.8,00,000 లోన్

➤ SBI ప్రస్తుతం విద్యా రుణాలపై 6.70 శాతం వడ్డీ రేటును కలిగి ఉంటుంది. ఇందులో రూ.29,893 EMI ఉంటుంది. 

➤ బ్యాంక్ ఆఫ్ బరోడాలో విద్యా రుణం తీసుకుంటే మీరు 6.75 శాతం వడ్డీని చెల్లించాలి. ఇందులో ఈఎంఐ రూ.29,942గా ఉంటుంది. 

➤ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విద్యా రుణంపై వడ్డీ రేటు 6.75 శాతం. ఇందులో రూ.29,942 EMI ఉంటుంది. 

Flash...   మొబైల్‌ లేకుండా వాట్సాప్‌!

➤ IDBI బ్యాంక్ విద్యా రుణాలపై 6.75 శాతం వడ్డీ రేటును కలిగి ఉంది. ఇందులో రూ.29,942 EMI ఉంటుంది. 

➤ యూనియన్ బ్యాంకులో విద్యా రుణంపై 6.80 శాతం వడ్డీని వసూలు చేస్తారు. ఇక్కడ రూ.29,990 EMI ఉంటుంది.

ALSO READ: 

SBI: PO పోస్టులకు నోటిఫికేషన్‌.. అర్హత, దరఖాస్తు వివరాలివే

SBI Alert: కస్టమర్లకు SBI అలర్ట్… గైడ్‌లైన్స్ విడుదల

PF ఖాతాకు సంబంధించిన వివరాలు ఇలా తెలుసుకోండి