GIRL STUDENTS MISSING: కలకలం..ఏపీలో నలుగురు పదో తరగతి విద్యార్థినీల అదృశ్యం

అమరావతి : ఒకే ప్రభుత్వ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినీల అదృశ్యం ఆ గ్రామంలో కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినుల్లో ఒకరు గత నెల 30 నుంచి కనిపించకుండా పోగా మరో ముగ్గురు నిన్నటి నుంచి( శనివారం )కనిపించక పోవడంతో విద్యార్థినీల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తమ కుమార్తెలు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

నలుగురు అమ్మాయిలు అదృశ్యమైనప్పటికీ.. ఇద్దరు అమ్మాయిలు మాత్రమే కనిపించడం లేదని ఫిర్యాదులు అందాయని, మరో ఇద్దరు అమ్మాయిల అదృశ్యంపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. గత నెల 30న ఉదయం స్కూల్ కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన విద్యార్థి సాయంత్రం వరకు కూడా ఇంటికి చేరుకోక పోవడంతో బాలిక తల్లిదండ్రులు పాఠశాల, ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆచూకీ కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

ఈ దశలో ఇదే పాఠశాలకు చెందిన పదోతరగతికి చెందిన ముగ్గురు బాలికలు శనివారం తెల్లవారుజాము నుంచి కనిపించకుండా పోవడం గ్రామంలో సంచలనం కలిగించింది. పిఠాపురం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే విద్యార్థినీలు హైదరాబాద్ కు వెళ్లినట్లు సాంకేతిక ఆదారాలు, సీసీ కెమెరా రికార్డుల ఆధారంగా తెలుస్తోంది.

SOURCE: ntnews.com

Flash...   DIKSHA e Content Creation Training for Three Days