Health Tips: మండే ఎండలు.. మీకు తరచూ వేడి చేస్తుందా..నిపుణుల సలహా
ప్రజంట్ అంతా కల్తీమయం అయిపోయింది. తినే ఫుడ్.. తాగే వాటర్ అంతా కల్తీ మయం. దీంతో ప్రజలు తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మన జీవనశైలి, పరిసరాలు, మారుతున్న కాలం కూడా రోగాల బారిన పడేలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇక శరీరంలో అధిక వేడిమి వల్ల ఎక్కువ అనారోగ్య సమస్యలు వెంటాడతాయని.. తద్వారా మీరు పలు రోగాల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక వేసవి(Summer) కాలంలో సాధారణంగానే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వల్ల శరీర ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు గురై.. డీహైడ్రేషన్ బారిన పడతారు. దీంతో శరీరంలో అధిక వేడి ఉత్పన్నం కావడం వల్ల తలనొప్పి(Headache), మలబద్దకం ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి.
ఒక్కోసారి ఈ డీహైడ్రేషన్ ప్రాణలకు ముప్పు తీసుకురావొచ్చు. మరి ఇలాంటి పరిస్థితి రావద్దంటే శరీర ఉష్ణోగ్రత నిలకడగా ఉండేలా చూసుకోవాలి. మెదడులోని హైపోథాలమస్ శరీరంలోని వేడిని నియంత్రిస్తుందని న్యూరాలజిస్ట్‌లు చెబుతున్నారు. దీంతోపాటు మనం తీసుకునే ఫుడ్, ఇతర అలవాట్లతో కూడా శరీరంలో అధిక వేడిని తగ్గించుకోవచ్చు. అందుకే వేడిని తగ్గించేందుకు కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం వల్ల సమస్యను అధిగమించవచ్చని వైద్య నిపుణుల సలహా
- కూర్చునే పరిసరాల్లో… తగినంత ఆక్సిజన్ ప్లాన్ చేసుకోవాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి..
- ఫ్యాన్, కూలర్ల వద్ద కొన్ని నిమిషాలు కూర్చుని సేదతీరాలి. లేకపోతే వేడి ఉత్పన్నమవుతుందని పేర్కొంటున్నారు నిపుణులు.
- అతిగా కూలింగ్ ఉన్న ఫ్రిజ్ వాటర్ తాగకూడదు
- వాటర్ కంటెంట్ ఉండే ఆహార పదార్థాలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లెమన్ జ్యూస్ తాగడంతో పాటు వేసవిలో విరిగిగా లభించే పుచ్చకాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి
- ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే కొద్దిసేపు కూర్చున్న తర్వాత లేచి అటూ ఇటూ తిరుగుతుండాలి.
- మణికట్టు, ఛాతీ లాంటి బాగాల్లో చల్లని నీళ్లను, లేక ఐస్‌ను రాస్తే కొంచెం ఉపశమనం లభిస్తుంది.
- థైరాయిడ్ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటే శరీరంలో అధిక వేడి ఉత్పన్నమవుతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం సైతం పెరుగుతుంది, అలాంటి వారు డాక్టర్‌ను సంప్రదించి సలహాలు పాటించాలి.
- శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు ఒంట్లో నీటి శాతం తగ్గి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే తరచుగా నీళ్లు, జ్యూస్ లాంటివి తాగాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది.
- ఒక స్పూన్ మెంతుల్ని తినడంగానీ, లేకపోతే వాటిని పొడిగా చేసి నీళ్లలో కలుపుకుని తాగినా అధిక వేడి నుంచి మీకు ఉపశనమనం లభిస్తుంది.
- ఈత కొట్టడం వల్ల, స్నానం చేయడం వల్ల కూడా ఉష్ణోగ్రత కొద్దిమేర తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ALSO READ:
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?
ఉదయాన్నే ఈ నీరు తాగితే Sugar అదుపులో.. ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు..!
నిద్ర తక్కువైతే కనిపించే సంకేతాలివే.. ఈ లక్షణాలు ఉంటె జాగర్త
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..
గుమ్మడికాయ గింజలు కనిపిస్తే అస్సలు వదలద్దు..! నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..