JIO అదిరిపోయే బంపరాఫర్, రూ.200కే ’14 OTT’ యాప్స్ సబ్‌స్క్రిప్షన్!
దేశీయ టెలికాం దిగ్గజం జియో తన కస్టమర్లు బంపరాఫర్ ప్రకటించింది. జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం “ఎంటర్‌టైన్‌మెంట్ బొనాంజా” కేటగిరీ కింద కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లోని జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లతో వినియోగదారులు నెలకు రూ.100, రూ.200 అదనంగా చెల్లించడం ద్వారా 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ కొత్త ప్లాన్‌లు ఏప్రిల్ 22 నుండి అందుబాటులోకి వస్తాయని జియో ఒక ప్రకటనలో తెలిపింది.
జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు, కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల వివరాలు:
►కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వినియోగదారులకు జీరో ఇన్‌స్టలేషన్ ఛార్జీతో జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను అందిస్తుంది. ఇన్‌స్టలేషన్ చేయించుకున్న యూజర్లకు ఇంటర్నెట్ బాక్స్ (గేట్‌వే రూటర్), సెట్ టాప్ బాక్స్ పొందవచ్చు.
► జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులు నెలకు 30ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూ. 399తో అపరిమిత హై స్పీడ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. అదనంగా, ఎంటర్‌టైన్మెంట్ పొందాలంటే నెలకు రూ.100 చెల్లిస్తే 6 ఓటీటీ సబ్ స్క్రిప్షన్, రూ.200 చెల్లిస్తే 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు.
(ఒక్క ఇంటర్నెట్‌కు రూ.399, 6 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్‌న్ కు 100తో కలిపి రూ.499, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ రూ.200 చెల్లింపుతో కలిపి రూ.599 చెల్లించాల్సి ఉంటుంది.
►ఒక్క ఇంటర్నెట్ అయితే రూ.699 చెల్లిస్తే 100ఎంబీపీఎస్ పొందవచ్చు. ఇక 6 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్‌కు 100తో కలిపి రూ.799, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ రూ.200 చెల్లింపుతో కలిపి రూ.899 చెల్లించాల్సి ఉంటుంది.
►ఒక్క ఇంటర్నెట్ అయితే రూ.999 చెల్లించి 150ఎంబీపీఎస్ పొందవచ్చు. ఉచితంగా 6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అదనంగా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ వినియోగించుకోవచ్చు.
►ఒక్క ఇంటర్నెట్ అయితే 300ఎంబీపీఎస్ స్పీడ్ కోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా 6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అదనంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్ స్క్రిప్షన్ వినియోగించుకోవచ్చు.
►500ఎంబీపీఎస్ వినియోగించుకోవాలంటే రూ.2499 చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా 6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అదనంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్ స్క్రిప్షన్ వినియోగించుకోవచ్చు.
►1000ఎంబీపీఎస్ కావాలంటే రూ.3999 చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా 6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అదనంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్ స్క్రిప్షన్ వినియోగించుకోవచ్చు.