JOBS IN AP: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.

 ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..


సాక్షి, అమరావతి: గ్రూప్‌ 1,2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 292 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 110 గ్రూప్‌-1.. 182 గ్రూప్‌-2 మొత్తం 292 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో గ్రూప్‌–1, 2 పోస్టులకు సంబంధించి జాబ్‌ క్యాలెండర్‌లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో ఈ పోస్టులు బాగా పెరిగాయి. గతంలో ఈ కేటగిరీల కింద కేవలం 36 పోస్టులు మాత్రమే పేర్కొనగా ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో గ్రూప్‌–1లో 110, గ్రూప్‌–2లో 182 పోస్టులు.. మొత్తం కలిపి 292 పోస్టులు వచ్చాయి. అలాగే, గ్రూప్‌–1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీఓ, సీటీఓ, డీఎస్పీ, డీఎఫ్‌ఓ, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓ వంటి పోస్టులు ఉండగా, గ్రూప్‌–2లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి.

Bank of Baroda : Branch Receivables Manager Vacancy 2022

SBI CLERKS , PO పోస్టులకు నోటిఫికేషన్‌.. అర్హత, దరఖాస్తు వివరాలివే

టెన్త్, డిగ్రీ అర్హతతో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు

Flash...   EMPLOYEES REVISED TRANSFER GUIDELINES GO MS 122