NEW DEOs TO NEW DISTRICTS: కొత్త జిల్లాలకు కొత్త డీఈవో లు 14 మంది అధికారులకు పదోన్నతులు

కొత్త జిల్లాలకు కొత్త డీఈవో లు  14 మంది అధికారులకు పదోన్నతులు

 అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుండంతో డీఈవోల నియామకంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. అలాగే జిల్లాల విద్యాశాఖాధి కారులు, డెప్యూటీ డైరెక్టర్ల పదోన్నతులకు పాఠశాల విద్యాశాఖసీనియారిటీ – జాబితా రూపొందించింది. ప్రస్తుతం డెప్యుటీ విద్యాశాఖాధికారులు, సహాయ సంచాలకులు, బీఈడీ, డైట్ లెక్చరర్లుగా పని చేస్తున్న అధికారుల పేర్ల జాబితా సిద్ధం చేశారు.

మొత్తం 14 మంది అధికారులకు పదోన్నతులు కల్పించాలని భావిస్తున్నారు. మరోవైపు పాఠశాలల సంఖ్య దామాషాలో కొత్త జిల్లాల్లో ఏర్పాటయ్యే డీఈవో కార్యాలయాల్లో అసిస్టెంట్ డైరెక్టర్, సూపరిం టెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర ఉద్యోగుల నియామకాలు దాదాపుగా పూర్తయ్యాయి. వివిధ శాఖల్లో పని చేస్తున్నన ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త జిల్లాలకు కొత్త డీఈవోలు వస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరుకు పదోన్నతుల షెడ్యూల్ విడుదల కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏ జిల్లాకు ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కావాలో, ఎస్జీటీ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి వచ్చిన తర్వాత పదోన్నతులు జరగనున్నాయి. ఏప్రిల్ రెండో తేదీ ఉగాది రోజునుంచే కొత్త జిల్లాల కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలు శాశ్వత, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కేటాయింపులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Flash...   Online competition for teachers on “Preparation of Communication material” – Relating to NPE-2020