SALARIES : జీతాలు ఇక 4వ తేదీ తరువాతే?

 

ఎప్పటిలాగే రాష్ట్రం లో ఉద్యోగుల వేతనాలకు మరో బ్రేక్ పడింది. నిన్న సాయంత్రానికే వేతనాల బిల్లును డ్రాయింగ్ అధికారులు అప్‌లోడ్ చేశారు. పే రోల్ వెబ్ నుంచి రిజర్వు బ్యాంకుకు బిల్లులు అప్‌లోడ్ కాలేదు.

సాంకేతిక సమస్యతో అప్‌లోడింగ్ ఆగిపోయింది. ఈ రోజు బిల్లులన్నీ సీఎఫ్ఎంఎస్ ద్వారా అప్లోడ్ చేయాలని డీడీవోలకు మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సీఎఫ్ఎంఎస్ ద్వారా పెన్షన్ బిల్లులు అప్‌లోడ్ అయ్యాయి. వరుసగా సెలవులు రావడంతో ఎక్కువమంది డ్రాయింగ్ అధికారులు సెలవు పెట్టి వెళ్లారు. సాయంత్రానికల్లా సీఎఫ్ఎంఎస్‌లో వేతనాల బిల్లులు అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీతాలు ఇక 4వ తేదీ తరువాతే? అని తెలుస్తోంది.

Flash...   Financial Tips: జీతం చాలడం లేదా? ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి..