SBI Alert: కస్టమర్లకు SBI అలర్ట్… గైడ్‌లైన్స్ విడుదల

SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ అలర్ట్… గైడ్‌లైన్స్ విడుదల చేసిన బ్యాంక్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్. ఇటీవల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏటీఎం, యూపీఐ మోసాలు పెరిగిపోతుండటంతో ఎస్‌బీఐ డిజిటల్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం ట్రాన్సాక్షన్స్, యూపీఐ పేమెంట్స్ (UPI Payments) విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? లావాదేవీల విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి? అన్న వివరాలను ఎస్‌బీఐ వివరించింది. ఎస్‌బీఐ విడుదల చేసిన డిజిటల్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్ ఎస్‌బీఐ ఖాతాదారులకు మాత్రమే కాదు, ఇతర బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నవారికి కూడా ఉపయోగపడతాయి. మరి ఆ గైడ్‌లైన్స్ ఏంటో తెలుసుకోండి.

READ: How to Link Aadhaar with Bank Account 

Login Security: మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తుంటారా? అయితే కష్టతరమైన పాస్‌వర్డ్స్ ఉపయోగించాలి. తరచూ పాస్‌వర్డ్స్ మారుస్తూ ఉండాలి. మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పిన్ ఎక్కడా రాసిపెట్టుకోకూడదు. ఎవరికీ షేర్ చేయకూడదు. బ్యాంకు సిబ్బంది ఎవరూ మీ యూజర్ ఐడీ, కార్డ్ నెంబర్, పిన్, పాస్‌వర్డ్, సీవీవీ, ఓటీపీ అడగరన్న విషయం గుర్తుంచుకోవాలి. లాగిన్ చేసేప్పుడు ఆటో సేవ్, రిమెంబర్ లాంటి ఆప్షన్స్ అస్సలు వాడకూడదు.

READ: అమ్మ ఒడి కి సంబంధించి తాజా అకౌంట్ అప్డేట్. 

Internet Security: మీరు నెట్ బ్యాంకింగ్ చేసేప్పుడు బ్యాంకు వెబ్‌సైట్‌లో https అని ఉందో లేదో చూడాలి. https ఉంటేనే అది బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌గా భావించవచ్చు. పబ్లిక్ వైఫై ఉపయోగించి బ్యాంకు లావాదేవీలు చేయకూడదు. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కోసం ఓపెన్ వైఫై నెట్వర్క్స్ అస్సలు వాడకూడదు. లావాదేవీలు పూర్తైన తర్వాత లాగౌట్ చేయడం తప్పనిసరి.

READ: ఏడేళ్లలో మీ పిల్లల పేరుతో రూ.11 లక్షలు రిటర్న్స్ పొందొచ్చు 

UPI Security: మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారా? మీ యూపీఐ పిన్, మొబైల్ పిన్ వేరుగా ఉండాలి. రెండూ ఒకటే మెయింటైన్ చేయడం చాలామందికి అలవాటు. కానీ దీని వల్ల చిక్కులు తప్పవు. గుర్తు తెలియని వ్యక్తులు యూపీఐ ద్వారా రిక్వెస్ట్ పంపితే అస్సలు యాక్సెప్ట్ చేయకూడదు. ఇలాంటివి పదేపదే వస్తే బ్యాంకుకు కంప్లైంట్ చేయండి. మీరు మీ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటేనే పిన్ అవసరం అన్న విషయం గుర్తుంచుకోండి. మీకు డబ్బులు రావాలంటే మీరు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.

Flash...   విద్యార్థులకు రూ.20,000 స్కాలర్‌షిప్‌.. ఫిబ్రవరి 15 చివరితేది

READ: అమ్మఒడి 2022 కి కొత్త రూల్స్ ఇవే..! లేకుంటే డబ్బులు రావు..! 

Card Security: మీరు ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేసేప్పుడు, పీఓఎస్ డివైజ్‌లో కార్డ్ స్కాన్ చేసేప్పుడు మీ పక్కన ఎవరూ లేకుండా జాగ్రత్తపడండి. మీ పిన్ ఎంటర్ చేసేప్పుడు కీప్యాడ్ కవర్ చేయండి. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో మాత్రమే లావాదేవీలు చేయండి. మీ ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డుకు కార్డ్ ట్రాన్సాక్షన్ లిమిట్ సెట్ చేసుకోండి. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్, పీఓఎస్, ఏటీఎంలకు ఈ లిమిట్ వేర్వేరుగా సెట్ చేసుకోవచ్చు.

Mobile Banking Security: మొబైల్ బ్యాంకింగ్ విషయంలోనూ కష్టతరమైన పాస్‌వర్డ్స్ సెట్ చేయండి. మీ స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్‌కి బయోమెట్రిక్ పర్మిషన్ కూడా ఎనేబుల్ చేయండి. మీ మొబైల్ పిన్ ఎవరితో షేర్ చేయొద్దు. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఉపయోగించే వీలున్న ప్రతీ చోటా ఈ ఫీచర్ వాడుకోండి. గుర్తుతెలియని వ్యక్తులు పంపే యాప్స్ అస్సలు డౌన్‌లోడ్ చేయొద్దు. అనధికార యాప్ స్టోర్స్‌లోని యాప్స్ ఇన్‌స్టాల్ చేయొద్దు. యాప్స్ ఇచ్చే పర్మిషన్స్‌ని కూడా పరిశీలించండి. మీ ఇంట్లోని వైఫై లేదా మొబైల్ డేటా మాత్రమే ఉపయోగించాలి.

మీ ఆధార్ కార్డు కి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ లింక్ అయ్యాయో ఇక్కడ తెలుసుకోండి

Social Media Security: సోషల్ మీడియాలో మీ బ్యాంకింగ్ వివరాలు అస్సలు షేర్ చేయకూడదు. మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా షేర్ చేయొద్దు. మీ బ్యాంకు లావాదేవీలు, అకౌంట్ నెంబర్లు, కార్డు నెంబర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు.