SBI Loan: బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రూ.8,00,000 లోన్… SBI నుంచి మరోసారి ఆఫర్
READ: SBI: ఎస్‌బీఐ నుంచి అద్భుతమైన ఛాన్స్… రూ.9,00,000 ప్రైజ్ మనీ
SBI కస్టమర్లు తమకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఎంత మంజూరైందో తెలుసుకోవడానికి తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ నెంబర్‌లోని చివరి 4 అంకెలు టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు మీ అకౌంట్ నెంబర్ చివర్లో 1234 అని ఉంటే PAPL 1234 అని టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి.
READ: అమ్మ ఒడి కి సంబంధించి తాజా అకౌంట్ అప్డేట్
SBI నుంచి ఎస్ఎంఎస్ ద్వారా మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఎంత మంజూరైందో ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం రూ.8,00,000 వరకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఇస్తోంది ఎస్‌బీఐ. అయితే కస్టమర్ల ప్రొఫైల్, ఉద్యోగం, ఆదాయం, క్రెడిట్ హిస్టరీ, తిరిగి చెల్లించే సామర్థ్యం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని లోన్ మొత్తాన్ని నిర్ణయిస్తుంది ఎస్‌బీఐ. మీకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ మంజూరైనట్టైతే యోనో ఎస్‌బీఐ యాప్‌లో ఈజీగా రుణం పొందొచ్చు. ఇందుకోసం ఈ స్టెప్స్ ఫాలో కావాలి.
Step 1- ముందుగా యోనో యాప్ డౌన్‌లోడ్ చేయాలి.
Step 2- మీ వివరాలతో ముందుగా రిజిస్టర్ చేయాలి.
Step 3- గతంలోనే రిజిస్టర్ చేసినవారు లాగిన్ చేయాలి.
Step 4- లాగిన్ చేసిన తర్వాత PAPL బ్యానర్ పైన క్లిక్ చేయాలి.
Step 5- ఆ తర్వాత మీరు ఎంత లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి.
టెన్యూర్ ఎంచుకోవాలి.
Step 6- సబ్మిట్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
Step 7- ఓటీపీ ఎంటర్ చేస్తే మీ అకౌంట్‌లో లోన్ డబ్బులు జమ అవుతాయి.
SBI నుంచి ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ పొందేందుకు కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు ఫీజు, డాక్యుమెంటేషన్ కూడా ఉండదు.
ALSO READ:
SBI: PO పోస్టులకు నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు వివరాలివే
SBI Alert: కస్టమర్లకు SBI అలర్ట్… గైడ్‌లైన్స్ విడుదల