Breaking News: SBI లోన్ తీసుకున్న వారికి బ్రేకింగ్ న్యూస్.. బ్యాంక్ ఈ నిర్ణయంతో మీ EMIలు పెరగనున్నాయ్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (MCLR)ను ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది. అన్ని రకాల రుణ కాలావధికి (all loan tenors) ఈ పెంపు వర్తిస్తుంది. ఒక బేసిస్ పాయింట్(Basis Point).. పర్సంటేజ్(Percentage) పాయింట్‌లో నూరవ వంతుకు సమానం. ఈ పెంపు 2022 ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీనివల్ల హోమ్ లోన్(Home Loan), ఆటో లోన్స్(Auto Loans), ఇతర రుణాలు చాలా ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది.
ఏప్రిల్ 15 నుంచి కాలవ్యవధి వారీగా అమల్లోకి వచ్చిన MCLR వివరాలు..
ఒక రోజు – 6.75
ఒక నెల – 6.75
మూడు నెలలు – 6.75
ఆరు నెలలు – 7.05
ఒక సంవత్సరం – 7.10
రెండు సంవత్సరాలు – 7.30
మూడు సంవత్సరాలు – 7.40
ALSO READ:
SBI Youth for India Fellowship 2022: నెలకు రూ.16,000 స్టైపెండ్.. రూ.50,000 అలవెన్స్
సుకన్య సమృద్ధి యోజన, NPS, PPF ఖాతాదారులు అలర్ట్.
SBI Jobs 2022: Upcoming SBI CLERKS , PO పోస్టులకు నోటిఫికేషన్
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బ్యాంకులు MLCR రేటును పెంచుతున్నాయి. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) కూడా మారిజినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను 5 bps వరకు పెంచింది. బెంచ్‌మార్క్ వన్-ఇయర్ కాలావధికి ఇప్పుడు MLCR 7.35 శాతంగా ఉంది. ఈ రేట్లు 2022 ఏప్రిల్ 12 నుంచి అమలులోకి వచ్చాయి. ఓవర్‌నైట్, ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలల MCLRలు 0.05 శాతం చొప్పున పెరిగి.. వరుసగా 6.50 శాతం, 6.95 శాతం, 7.10 శాతం, 7.20 శాతానికి పెరిగాయి. ఈ బెంచ్‌మార్క్ వన్-ఇయర్ టేనర్ MCLR రేటు పెంపుతో పర్సనల్, ఆటో లోన్స్, హోమ్ లోన్‌లతో పాటు ఇతర రుణాల ఖర్చు పెరగనుంది.
గత వారం ద్రవ్య విధానంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదలకు ఆజ్యం పోసిన నేపథ్యంలో, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్బీఐ పేర్కొంది. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎమ్‌సీఎల్‌ఆర్ రేటును పెంచింది. ఆ తర్వాత తాజాగా స్టేట్ బ్యాంకు కూడా ఇదే బాటలో నడిచింది. అయితే రానున్న రోజుల్లో మరిన్ని సంస్థలు కూడా MCLR రేటును పెంచే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
MCLR అనేది ఆర్థిక సంస్థకు సంబంధించిన రిఫరెన్స్ రేట్ లేదా ఇంటర్నల్ బెంచ్‌మార్క్. మినిమం లోన్ రేటును నిర్ణయించడానికి ఈ రేటు ప్రమాణికంగా ఉంటుంది. MCLR పద్ధతిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016లో ప్రవేశపెట్టింది.
ఈఎంఐలపై ప్రభావం..
బేసిస్ పాయింట్లు పెంచిన దాని ప్రకారం చూస్తే.. ఈఎంఐలు(EMI)లు పెరిగే అవకాశం ఉంది. కొత్తగా లోన్ తీసుకునే వారికి కూడా ఇది వర్తిస్తుంది. అలాగే గతంలో ఫ్లోటింగ్ ఇంట్రస్ట్ మీద లోన్ తీసుకున్న వారికి కూడా ఈఎంఐలు(EMI) పెరుగుతాయి. కేవలం ఫిక్స్ డ్ కింద తీసుకున్న వారి మీద ఎలాంటి ప్రభావం ఉండదు.