Sinus Pain Relief Tips: ఈ ఒక్క గ్లాస్ జ్యూస్‌తో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు

Sinus Pain Relief Tips: ఈ ఒక్క గ్లాస్ జ్యూస్‌తో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. మ్యాజిక్ సొల్యూషన్ ఇప్పుడే తెలుసుకోండి..!


Sinus Pain Relief Tips: వేసవి కాలంలో వడ దెబ్బ, అకాల వర్షాలతో సైనస్ సమస్య వేధిస్తుంటాయి. ప్రస్తుతం వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ.. సూర్యుడి దెబ్బకు జనాలు అతలాకుతలం అవుతున్నారు. అన్ని వయసుల వారిలో హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతోంది. ముఖ్యంగా ఎండ నుంచి ఇంట్లోకి వచ్చిన తరువాత తీవ్రమైన తలపోటు, ముక్కు కారడం, గొంతు నొప్పి, దగ్గు ఇవన్నీ వేధిస్తుంటాయి. సైనస్, మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు ఈ తీవ్రమైన ఎండల వల్ల ఎక్కువగా బాధపడుతారు. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చిన తరువాత వెంటనే చల్లని నీరు తాగొద్దు. కాసేపు కూర్చున్న తరువాతే నీళ్లు తాగాలి.

అలాగే ప్రతి రోజూ ఉదయం డిటాక్స్ డ్రింక్స్ తాగాలి. సైనస్, మైగ్రేన్ సమ్యలతో సతమతం అవుతున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. హీట్ స్ట్రోక్, సైనస్ పెయిన్, మైగ్రేన్ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని రకాల డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవలి. వీటితో సదరు సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు.. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరి ఆ డిటాక్స్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దానిమ్మ-ఓట్స్ జ్యూస్.. 


దానిమ్మ, ఓట్స్, పాలు, చియా గింజలు, పండిన బొప్పాయి, యాపిల్‌ ముక్కలను మిక్స్ చేయాలి. వీలైతే అక్రోట్లను కూడా కలుపొచ్చు. వీటన్నింటినీ కలిపి జ్యూస్ తీసుకుని తాగాలి. ఈ జ్యూస్ మీ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరం జబ్బుల బారిన పడకుండా కాపాడుతాయి. శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. అయితే, దీనిని ఫ్రిజ్‌లో పెట్టుకుని తాగొద్దు.

క్యారెట్- బీన్స్ జ్యూస్.. 


క్యారెట్, బీన్స్, కాయధాన్యాలు, టమోటాలు, చిలగడదుంపలను చిన్న ముక్కలుగా ఉడికించాలి. ఉడికించేటప్పుడు, ఉప్పు, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, అల్లం-వెల్లుల్లి ముక్కలు వేయాలి. ఇవన్నీ ఉడికిన తరువాత బ్లెండర్‌లో వేసి జ్యూస్‌ మాదిరిగా చేయాలి. ఈ సూప్ ను వేడివేడిగా తినొచ్చు లేదంటే చల్లార్చి కూడా తీసుకొచ్చు. దీని వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

Flash...   TEACHERS DIARY FOR ALL SUBJECTS DOWNLOAD

అరటి-కివి జ్యూస్.. 


ఒక కప్పు అరటిపండు, కివీ, పైనాపిల్, యాపిల్, బాదం వెన్న, ఖర్జూరం, చియా గింజలు మిక్స్ చేసి జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్ ఖాళీ కడుపుతో అస్సలు తీసుకొవద్దు. దీనిని తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.