TIS_Updation of Newly Added Teacher Profile : 09.04.2022
టీచర్ ప్రొఫైల్ వ్యక్తిగత లాగిన్ నుండి డిజేబుల్ చేయడం జరిగింది.
ఇప్పటికీ అప్డేట్ చేయని ఉపాధ్యాయుల ప్రొఫైల్ లను ప్రస్తుతం ఉన్న MEO/HM మరియు DEO లాగిన్ లో చేయవలసి ఉంటుంది.
మొదట ఆ టీచర్ ని సంబంధిత పాఠశాల లో యాడ్ చేయవలెను.(ఇప్పటికే పాఠశాల లో నమోదై ఉంటే ఇబ్బంది లేదు).
ఇప్పుడు MEO/ HM,DEO లాగిన్ లలో…
⏩ Dept Login
⏩ services,
⏩ staff,
⏩ cadre strength,
⏩ select school,
⏩ Get details …
పైన నొక్కితే cadre strength విండో ఓపెన్ అవుతుంది.
వచ్చిన విండోలో ఉన్న Teacher details నందు ఉపాధ్యాయుల జాబితా వస్తుంది.
ఈ జాబితా లో మనం కొత్తగా యాడ్ చేసిన ఉపాధ్యాయుని వివరాల లైన్ ( Row) కూడా వస్తుంది.
ఈ టీచర్ Row ఎదురుగా ఉన్న Edit button ( red colour) లో నొక్కితే ఒక ఖాళీ Teacher Profile ఓపెన్ అవుతుంది.
అందులో ఆ టీచర్ వివరాలు నింపి confirm చేసినచో…ఆ టీచర్ ప్రొఫైల్ DEO లాగిన్ కి యధావిధిగా ఫార్వర్డ్ చేయబడుతుంది.
అలాగే ఆటీచర్ పేరు ముందున్న Edit బటన్ Green colour లోకి మారిపోతుంది
TIS_MEO/HM Confirmation:
1.TIS- Individual profiles అన్నీ సంబంధిత MEO/HM (simply DDOs) లాగిన్ లకు అప్లోడ్ చేయబడ్డాయి.
2. Route Map:
—-> Login
—> Services
—-> Staff
—->Select school
—-> Get details
—->cadre strength నందు Teacher details.
3. Teacher details నందు ఆ పాఠశాల లోని ఉపాధ్యాయుల జాబితా వస్తుంది.
ప్రతి ఉపాధ్యాయుని వివరాలు ఎదురుగా Edit ఆప్షన్ కనబడుతుంది.
Edit నొక్కితే ఆ ఉపాధ్యాయుని profile ఓపెన్ అవుతుంది. నాలుగు విండోలలో confirm బటన్ ఉంటుంది.
సంబంధిత అధికారి ఉపాధ్యాయుని సర్వీసు పుస్తకం ఆధారంగా ఆయా ఉపాధ్యాయులు నమోదు చేసిన వివరాలు పరిశీలించి, తప్పులేమైనా ఉంటే సరిచేసి,కింద ఉన్న confirm బటన్ ద్వారా ఈ విండో వివరాలు ధృవీకరించాలి.
అలాగే మిగిలిన మూడు విండోలూ ధృవీకరణ చేయాలి.
4. ఒక ఉపాధ్యాయ ప్రొఫైల్ ధృవీకరణ చేయగానే Teacher details నందు వారి పేరు ఎదురుగా ఉన్న Edit బటన్ Green colour లోకి మారిపోతుంది.
5. MEO/HM కన్పామ్ చేసిన టీచర్ ప్రొఫైల్ DEO లాగిన్ కి అందజేయడం జరుగుతుంది.
మరియు సంబంధిత అధికారి ఒకసారి మాత్రమే కన్ఫామ్ చేయగలరు.
6. సంబంధిత అధికారులు అందరూ వెంటనే తమ పరిధిలోని ఉపాధ్యాయుల ప్రొఫైల్స్ వెంటనే ధృవీకరణ చేసి, తదుపరి ప్రక్రియ కై సహకరించవలసినదిగా ప్రార్థన.