Weather Update: రైతులకు చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక ఎప్పుడంటే.!
ఒకవైపు భగభగ మండే సూర్యుడి తాపం.. మరోవైపు ఉక్కపోతలు.. ఈ రెండింటితో అల్లాడిపోతున్న జనాలకు, వర్షాల కోసం ఎదురు చూసే రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల సీజన్ ఉంటుందని ప్రకటించింది. నైరుతి రుతుపవనాల వర్షాలు ఈ ఏడాది సాధారణ స్థాయిలోనే ఉంటుందని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల కాలానుగుణ వర్షపాతం దీర్ఘకాల సగటు(LPA)లో ఈ ఏడాది 96 నుండి 104 శాతం మేర వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ గురువారం ఓ కీలక ప్రకటనలో వెల్లడించింది.
మండే ఎండలు.. మీకు తరచూ వేడి చేస్తుందా.. ఇదిగో టిప్స్
ఎండాకాలం ఈ జబ్బుల ప్రమాదం ఎక్కువ.. జాగ్రత్త..!
AP NEW CABINET 2.0: AP మంత్రులకు శాఖల కేటాయింపులు
మధుమేహం బారిన పడిన వారు ఎవరిని సంప్రదించాలి.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?
జూన్ నెలలో నైరుతి రుతుపవనాల ప్రారంభం తర్వాత ఉత్తర, మధ్య భారత్‌లోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని.. అలాగే ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ద్వీపకల్పంలోని దక్షిణ ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాగా, గతేడాది కూడా నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండగా.. అప్పుడు కూడా సాధారణ వర్షపాతమే నమోదైంది. సాధారణ లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం ఇది వరుసగా మూడోసారి