ఈ నెల 16వ తేదీన రైతు భరోసా
ఈసారి ముందుగానే సాగునీళ్లు
గౌతంరెడ్డి పేరుతో యూనివర్సిటీ
పలు కంపెనీలకు భూముల కేటాయింపు
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
మరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ కేలండర్, సాగునీటి విడుదలకు సంబంధించిన ప్రణాళికలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ నెల 16న రైతు భరోసా…జూన్ 21వ తేదీన అమ్మ ఒడి ఇస్తామని ప్రకటించింది. అదేవిధంగా సాగునీటి విడుదలను ఏ డెల్టాకు ఎప్పుడు విడుదల చేస్తామన్నదీ చెప్పింది. గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
READ: అమ్మ ఒడి కి సంబంధించి తాజా ACCOUNTఅప్డేట్
చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ… .సంక్షేమా నికి క్యాలండర్ ప్రకటించిన తొలి పాలకుడు జగన్. శుక్రవారం సీఎం ముమ్మిడివరంలో మత్స్యకార భరోసా పథకం ద్వారా నిధులు విడుదల చేస్తారు. ఈ నెల 16న రైతు భరోసా పథకంలో భాగంగా రూ.5,500 ఖాతాల్లో వేస్తారు. ఇదే పథకం కింద ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద వచ్చే రూ.2వేలు ఈ నెల 31వ తేదీన వేస్తాం. 19న పశువుల కోసం అంబులెన్స్‌లు ప్రారంభిస్తాం. జూన్ 6వ తేదీన 3వేల ట్రాక్టర్లు, 4,200హార్వెస్టర్ల పంపిణీ చేస్తాం. జూన్ 14న వైఎస్సార్ పంటల బీమా ద్వారా 2021ఖరీఫ్ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అంది స్తాం. జూన్ 21వ తేదీన అమ్మ ఒడి తల్లుల ఖాతాల్లో వేస్తాం’’ అని పేర్కొ న్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నాణ్యతతో చేయా లని సీఎం చెప్పారని, వైసీపీ ఎమ్మెల్యేలు లేనిచోట్ల ప్రభుత్వ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు కలిసి ఈ కార్యక్రమం చేస్తారని చెల్లుబోయిన తెలిపారు.
ALSO READ:
మీ ఆధార్ కార్డు కి బ్యాంకు ACCOUNT లింక్ అయ్యిందా లేదా తెలుసుకోండి
How to Link Aadhaar with Bank Account for AMMA VODI
PF ఖాతా యొక్కవివరాలను కేవలం ఒక మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు.