CIBIL స్కోర్ ని తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇలా ఈజీగా చెక్ చేసుకోచ్చు..!

CIBIL స్కోర్ ని తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇలా ఈజీగా చెక్ చేసుకోచ్చు..!

మీ క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకునే అవసరం ఎంతైనా వుంది. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తరచూ తమ సిబిల్ స్కోర్ ని చెక్ చేసుకోవాలి. గతంలో బ్యాంకు లో లోన్‌కు అప్లై చేస్తే బ్యాంకు సిబ్బంది వెరిఫికేషన్ చేసి లోన్ ని ఇచ్చేవారు. ఇప్పుడు కూడా కొన్ని లోన్స్ కి సిబిల్ స్కోర్ చెక్ చేస్తూ వుంటున్నారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

పర్సనల్ లోన్, కార్ లోన్, టూవీలర్ లోన్, హోమ్ లోన్, క్రెడిట్ కార్డ్ వంటి వాటికి కస్టమర్ల సిబిల్ స్కోర్ చెక్ చేసి లోన్ ఇస్తారు. ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే ముందే లోన్ రిజెక్ట్ చేస్తాయి బ్యాంకులు. ఇండియాలో సిబిల్ స్కోర్ 2007లో అమలు లోకి వచ్చింది.

అయితే అప్పటి నుండి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థల్లో అప్పులు తీసుకొని చెల్లించినవారికి క్రెడిట్ స్కోర్ ని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సంస్థ కేటాయిస్తోంది. ఈ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750 కన్నా ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే మంచి క్రెడిట్ స్కోర్‌గా చూస్తారు. గతం లో ఎన్ని రుణాలు తీసుకున్నారు, వాయిదాలు ఎలా చెల్లించారు, ప్రస్తుతం ఎన్ని రుణాలు యాక్టీవ్‌లో వున్నాయనేవి కూడా చూడచ్చు. ఆన్ లైన్ లో సిబిల్ స్కోర్ ఇలా చెక్ చేసుకోవాలి.

ముందుగా https://www.cibil.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

నెక్స్ట్ Get your CIBIL Score మీద నొక్కండి.

మీ యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయండి.

ఇప్పుడు go to dashboard పైన క్లిక్ చేయండి.

కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ క్రెడిట్ స్కోర్ ని చూడచ్చు.

CLICK HERE TO KNOW CIBIL SCORE

Flash...   Message form Director school Education abut Transfers web options