CYCLONE LIVE UPDATES: జెట్‌స్పీడ్‌తో దూసుకొస్తున్న అసని తుఫాన్.. కోస్తాంద్ర తీరంలో మొదలైన అలజడి.

తుఫాన్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌..

తుపాను ఇప్పుడు ఎక్కడ ఉందో లైవ్ చూడండి

03:58 PM, May 11 2022

కొనసాగుతున్న రెడ్ అలర్ట్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అసాని తుపాను కొనసాగుతుంది. ఇది దిశను మార్చుకుని ఉత్తర ఈశాన్య కదులుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. ప్రస్తుతం గంట 6 కి.మీ వేగంతో పయనిస్తుందని.. రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు.

03:33 PM, May 11 2022

నరసాపురం తీరం వద్ద అసని తుఫాన్

అసని తుఫాన్ నరసాపురానికి 50 కిలోమీటర్ల దూరంలో పయనిస్తోంది. తీరానికి చేరువలోకి వచ్చాక తుఫాన్ వేగం గంటకు 3 కిలోమీటర్లకు తగ్గిపోయింది. తుఫాన్ ప్రభావంతో భారీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.

11 May 2022 11:05 AM (IST)

తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడిన అసని

తీవ్ర తుపాను ‘అసని’ మరి కాసేపట్లో మచిలీపట్నం వద్ద భూభాగంపైకి వచ్చే
అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.


అంతు చూస్తానంటూ దూసుకొచ్చిన అసని తుపాను.. అంత లేదంటూ క్రమంగా
బలహీనపడుతోంది. కోస్తాంద్ర తీరంవైపు దూసుకొచ్చినట్టే వచ్చి తీరాన్ని తాకక
ముందే… దిశ మార్చుకుంటూ ఎప్పటికప్పుడు భయపెట్టినా… ఏకంగా ఐదుసార్లు
రూట్ మార్చుకున్నా… చివరకు బలహీన పడుతోంది.

11 May 2022 07:43 AM (IST)

తుపాను కాకినాడ దగ్గర సముద్రంలోకి అసని

తుపాను కాకినాడ దగ్గర సముద్రంలోకి అసని రానుంది. రేపు సాయంత్రానికి
వాయుగుండంగా బలహీనపడనుంది. ప్రస్తుతం తుపాను పరిసర ప్రాంతాల్లో
85కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అసని ఎఫెక్ట్‌తో సముద్రపు అలలు
3మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. పూర్తిగా బలహీనపడే వరకు తీవరం వెంట
పయనించనుంది అసని తుపాను. తీరానికి అతి దగ్గరగా రావడంతో గాలుల తీవ్రత
తగ్గింది.

11 May 2022 07:33 AM (IST)

విశాఖ నుంచి అన్ని విమాన సర్వీసులు రద్దు

Flash...   Telangana Lockdown: తెలంగాణలో లాక్ డౌన్ విధింపు.. రేపట్నించే, నిబంధనలివే.

అసని తుపాను దృష్ట్యా ఇవాళ విశాఖ నుంచి అన్ని విమాన సర్వీసులు రద్దు
చేశారు. కోనసీమ జిల్లాపై తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతర్వేది,
శంకరగుప్తం, ఓడలరేవు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమ
జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో తీర ప్రాంత
గ్రామాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

తుపాను ఇప్పుడు ఎక్కడ ఉందో లైవ్ చూడండి

11 May 2022 07:18 AM (IST)

అసని తుఫాన్ అప్డేట్..

అసని తుఫాన్ ప్రభావం కారణంగా కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాలు,
యానాం,విశాఖ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశముందని
వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మిగతా కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు
నుంచి భారీ వర్షాలు పడే అవకాశం. కోస్తా తీరం వెంబడి గంటకు 75 నుంచి 95
కిలోమీటర్లు మేర గాలులు వీచే అవకాశం

10 May 2022 05:19 PM (IST)

మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలి..

తుఫాన్‌ తీరం దాటడంపై అనిశ్చితి కొనసాగుతోందని రానున్న 48 గంటలపాటు
అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం కలెక్టర్‌ డాక్టర్ మల్లిఖార్జున సూచించారు.
ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని, ఎలాంటి
ప్రాణ, అస్తి నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని కలెక్టర్‌
తెలిపారు. 

తుపాను ఇప్పుడు ఎక్కడ ఉందో లైవ్ చూడండి

10 May 2022 03:55 PM (IST)

తుఫాన్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌..

అసని తుఫాన్‌పై విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్‌ సునంద ప్రకటన చేశారు.
తుఫాన్‌ కాకినాడకు అగ్నేయంగా 260 కిలో మీటర్ల దూరంలో ఉందని తెలిపారు.
ప్రస్తుతం తుఫాన్‌ మచిలీపట్నం వైపుగా ప్రయాణిస్తోందని, దిశ మార్చుకునే అవకాశం
ఉందని ఆమె తెలిపారు. అయితే తుఫాన్‌ తీరం దాటడంపై ఇంకా ఎలాంటి స్పష్టత
రాలేదని, తీరం దాటకుండానే బలహీన పడే అవకాశముందని ఆమె పేర్కొన్నారు

Flash...   PRC - 2018 BASIC PAY CALCULATOR

కాకినాడ కోత.. తీర ప్రాంతాల్లో కుంభవృష్టి హెచ్చరిక

అసానీ తుఫాను కన్ను (CYCLONE EYE) మచిలీపట్నం రాడార్ లో మనకు చాలా
స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కన్ను భూమిని తాకే సమయంలో మనకు గాలులు, వర్షాలు
ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతానికి తీవ్ర తుఫాను బంగాళాఖాతంలో మచిలీపట్నానికి
200 kms కి.మీ. దూరంలో కొనసాగుతోంది. ఎంతో అసహజమైన వాతావరణం మధ్య తుఫాను
కొనసాగుతోంది. దీని వల్ల మనకు వర్షాలు కృష్ణా, గుంటూరు, బాపట్ల​, ప్రకాశం,
పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో నమోదవ్వనుంది. అలాగే విశాఖ​,
విజయనగరం, అనకాపల్లి పాడేరు జిల్లాల్లో కూడ వర్షాలు నమోదవ్వనుంది.

ఈ రోజు రాత్రి నుంచి ప్రకాశం, బాపట్ల​, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో
వర్షాలు పెరుగుతాయి. ప్రస్తుతానికి చినుకులు, మోస్తరు వర్షాలు ఉన్నప్పటికీ
రాత్రి నుంచి వర్షాలు పెరుగుతాయి. రేపు తెల్లవారిజామున నుంచి రేపు
అర్ధరాత్రి దాక భారీ వర్షాలు, 12 వ తేదీన తెల్లవారిజామున అతిభారీ వర్షాలు
మెత్తం  కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ​, కొనసీమ​,
బాపట్ల​, భారీ వర్షాలు – ఏలూరు, విజయవాడ​, విశాఖపట్నం, శ్రీకాకుళం,
విజయనగరం, పార్వతీపురం, పాడేరు జిల్లాల్లో కొనసాగనుంది. పల్నాడు
జిల్లాలోకూడ భారీ వర్షాలుంటాయి.

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు, మేఘావృతమైన ఆకాశం
కొనసాగనుంది. రాయలసీమ మిగిలిన జిల్లాల్లో చినుకులు, మేఘావృతమైన ఆకాశం
కొనసాగనుంది.


CLICK HERE TO FINE LIVE STATUS OF CYCLONE