మూడవ విడత అమ్మఒడికి సంబంధించి జిల్లాలోని అందరూ మండల విద్యాశాఖాధికారులకు
మరియు ఉప తనిఖీ అధికారులకు తగు సూచనలు
1. మూడవ విడత జగన్నన అమ్మఒడికి సంబంధించి అర్హులు జాబితా మరియు అనర్హుల
జాబితాను వార్డు సచివాలయాల నందు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారి వద్ద
ఉన్నది.
2. అన్ని పాఠశాలల వద్ద ఆయా పాఠశాలకు సంబంధించిన మూడవ విడత జగన్నన అమ్మఒడికి
సంబంధించి అర్హులు జాబితా మరియు అనర్హుల జాబితాను నోటీసు బోర్డ్ నందు
ప్రదర్శించవలెను.
3. మండలాలలో ఆయా మండలానికి సంబంధించిన మూడవ విడత జగన్నన అమ్మఒడికి సంబంధించి
అర్హులు జాబితా మరియు అనర్హుల జాబితాను నోటీసు బోర్డ్ నందు
ప్రదర్శించవలెను.
4. అర్హుల జాబితాలో రిమార్క్స్ నందు “ఇన్.యాక్టివ్” అని ఉన్నవారు బ్యాంక్
అక్కౌంట్ కలిగిన బ్యాంక్ నందు NPCI వారి యొక్క ఆధార్ ను బ్యాంక్ ఖాతాతో
అనుసంధానం చేయుట కొరకు సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారు తగు చర్య
తీసుకొనవలెను.
అమ్మ ఒడి సచివాలయం వారీగా కారణాలతో రీవెరిఫికేషన్ లిస్ట్ లు
5. అర్హత కలిగి అనర్హుల జాబితా నందు ఉన్నవారు వారి అనర్హతకు సంబంధించిన
దరఖాస్తులను అందుకు సంబంధించిన నకలను వార్డ్/సచివాలయ వెల్ఫేర్ &
ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారికి అందజేయవలెను.
6. వార్డ్/సచివాలయ వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారు అందుకు
సంబంధించిన నకలను నవశకం పోర్టల్ నందు అప్లోడ్ చేసి తదుపరి చర్య తీసుకొనగలరని
తెలియజేయడమైనది.
7. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు మూడవ విడత జగన్నన అమ్మఒడికి
సంబంధించి వారు పాఠశాలలో చదువుచున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సదరు
విషయముపై పూర్తి అవగాహన కల్పించి వారి యొక్క సమస్యలకు సరియైన పరిష్కారం చూపి
విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తి సహకారం అందించవలసినదిగా ఆదేశాలు జారీ
చేయవలసినదిగా కోరడమైనది.
మీ స్కూల్ DISE కోడ్ తో మీ పాఠశాల అమ్మఒడి అర్హుల వివరాలు డౌన్లోడ్ చేసుకోండి
8. ప్రతి మండలం నందు అమ్మఒడి గ్రీవియన్ సెల్ ఏర్పాటు చేసి, అమ్మఒడిపై పూర్తి
అవగాహన కలిగిన వారిని సదరు గ్రీవియన్ సెల్ నందు ఏర్పాటు చేసి వారి పేరు, హోదా
మరియు మొబైల్ నెంబర్ జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు
తెలియజేయవలెను.
9. ప్రతి మండల విద్యాశాఖాధికారి కార్యాలయము నందు అమ్మఒడి గ్రీవియన్ బ్యానర్
ను అందరికీ కనిపించే విధంగా ఏర్పాటు చేయవలసినదిగా తగు చర్య
తీసుకొనవలెను.
10. అమ్మఒడి గ్రీవియన్ వివరములు నిర్ణీత ఫార్మెట్ లో జిల్లా
విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు ప్రతిరోజూ సాయంత్రం గం.4.00 ల లోపుగా
అందజేయవలెను. ఏ విధమైన ఫిర్యాదులు లేనియెడల నిల్ రిపోర్ట్ ను పంపవలెను.
ప్రత్యేక గ్రీవెన్స్ రిజిష్టరు పెట్టవలెను.
వ.సంఖ్య |
మండలం |
ఫిర్యాదుదారుని పేరు |
చిరునామా |
సెల్ నెంబర్ |
ఫిర్యాదుదారుని పిల్లలు చదువుచున్న పాఠశాల |
సమస్య |
పరిష్కారం కొరకు తీసుకున్న చర్య
|
|
|
|
|
|
|
|
|
మండలాలకు సంబంధించి ఏ విధమైన యాడ్వెర్స్ న్యూస్ వచ్చినయెడల వెంటనే
స్పందించి, అందుకు సంబంధించిన తగు చర్యలు తీసుకొని రీజాయిండర్ ఇచ్చి,
నివేదికను ఈ కార్యాలయమునకు సమర్పించవలెను.
12. పై తెలియజేసిన సూచనలు అన్నియు కూడా జిల్లాలోని అందరూ పాఠశాలల
ప్రధానోపాధ్యాయులు వారికి అందేవిధంగా తగు చర్యలు తీసుకొనవలసినదిగా
ఆదేశించడమైనది.
ALSO READ: