MangoS: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా ఎలా గుర్తించాలో తెలుసా..

Mango: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా ఎలా
గుర్తించాలో తెలుసా..

mango

నోరూరించే తియ్య తియ్యటి మామిడిపండ్లు(Mango) దొరికే సీజన్ వచ్చేసింది..
కూరగాయల మార్కెట్లలో, రోడ్ల వెంట, సూపర్‌మార్కెట్లలో, పండ్ల దుకాణాల్లో.. తోపడు
బండ్లపైన.. ఇలా ఎక్కడ చూసినా మామిడి పండ్లు కుప్పలు.. కుప్పలుగా
కనిపిస్తున్నాయి. చక్కటి పసుపు రంగులో మెరిసిపోయే వాటిని చూడగానే.. వెంటనే
కొనేయాలి.. తినేయాలనిపిస్తుంది..! అయితే ఇటీవలి పసుపు రంగు కనిపించే పండ్లు..
మామిడి పండ్లు కాదు. మామిడిపండ్లు మన ఆరోగ్యానికి హానికారకంగా మారుతున్నాయి.
దీనికి కారణం వాటిని త్వరగా మగ్గేలా చేయడానికి హానికారకమైన క్యాల్షియం
కార్బైడ్(కార్సినోజెన్) వంటి రసాయనాలు ఉపయోగించడమే. ఫలితంగా క్యాన్సర్లకు
గురయ్యే అవకాశం ఉంది. అందుకే సహజసిద్ధమైన పద్ధతిలో పండిన వాటిని మాత్రమే
తినాలి. అయితే మామిడి పండ్లు రసాయనాలతో పండించారా..? లేక మగ్గబెట్టిన పండ్లా..?
సహజసిద్దంగా పండినవా.. ఎలా గుర్తించాలో తెలుసుకోవడం చాలా అవసరం..

సీజనల్ ఫ్రూట్స్ అంటేనే ప్రకృతి సిద్ధంగా పండినవి. అవి పండాలంటే ఆ పండులో
కొన్ని రసాయన చర్యలు జరిగి అవి పక్వానికి వస్తాయి. ఇలా అవి పండటానికి దోహదం
చేసేది ఇథిలీన్. కాయలు పక్వానికి వచ్చిన తర్వాత వాటిలో సహజంగా ఉండే ఈ రసాయనం
వల్ల అవి వాటంతట అవే పండుతాయి. అయితే ఇలా జరగముందే.. రైతుల నుంచి వ్యాపారులు
కాయలు పూర్తిగా పక్వానికి రాకమునుపే వాటిని కోసి మార్కెట్లకు తరలిస్తుంటారు. ఈ
క్రమంలో అవి బాగా పండినట్లుగా తయారవ్వడానికి క్యాల్షియం కార్బైడ్‌ను
ఉపయోగిస్తున్నారు. అయితే మనం మార్కెట్లో లభించేవాటిలో బాగా రంగు వచ్చిన లేదా
మగ్గిన పండ్లనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాం. ఇది కూడా రైతులు,
వ్యాపారస్థులు ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి పండ్లను మగ్గబెట్టి మార్కెట్లోకి
తసుకొస్తుంటారు. మనకు చూడటానికి అచ్చు మగ్గబెట్టిన పంబ్లను తలపిస్తున్నా అవి
సహసమైనవి కాదని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది.

మామిడి రంగుతో..

ప్రకృసిద్దంగా లభించే పండ్లను గుర్తించడానికి మొదటిది మామిడి పండు రంగు.
రసాయనాలు ఉపయోగించి మగ్గబెట్టిన మామిడిపండ్లు చూడటానికి పసుపు రంగులోనే ఉన్నా..
వాటిపై ఆకుపచ్చని రంగులో మచ్చలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటాయి. అలాగే మరి
కొన్నింటిలో మామిడి పండు సహజసిద్ధంగా పండినప్పుడు వచ్చే రంగు కంటే మరింత పసుపు
రంగులో మెరిసి పోతూ ఉంటాయి. సహజసిద్ధంగా పక్వానికి వచ్చిన పండైతే.. దాని రంగు
అంతా ఒకే విధంగా ఉంటుంది.

Flash...   శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 ఫోన్ పై ఏకంగా రూ. 9వేలు తగ్గింపు..

మామిడి  వాసనతో..

అయితే మార్కెట్లో లభించే పండ్లలో సహజసిద్ధమైనవి ఎంచుకోవాలంటే మరో చిట్కా కూడా
ఉంది. మామిడి పండ్లను వాసన చూడటం ద్వారా కూడా గుర్తించవచ్చు. సాధారణంగా సహజ
సిద్దంగా పండిన మామిడి పండు నుంచి వచ్చే వాసన చాలా మధురంగా ఉంటుంది. కానీ
కార్బైడ్ వేసి పండించిన మామిడి పండ్ల నుంచి ఘాటైన వాసన వస్తూ ఉంటుంది.
మరికొన్నిసార్లు పండు పసుపు రంగులో ఉన్నా దాని నుంచి ఎలాంటి వాసన రాదు. పండు
చాలా కృత్రిమంగా ఉంటాయి. అచ్చు ప్లాస్టిక్ మామిడిలా ఉంటాయి.

మామిడి పండ్లలోని గుజ్జుతో..

అయితే మరో చిట్కాల కూడా ఉంది. అయితే మనం మామిడిని తీసుకుని అందులోని గుజ్జునూ
పరిశీలించి కూడా గుర్తించ వచ్చు. మామిడిపండు పైకి బాగానే కనిపించినా.. అది
సహజసిద్ధమైనదేనని నిర్ధరించుకోవాలంటే.. దాని గుజ్జును పరిశీలించాలిస్తే
తేలిపోతుంది. ఎందుకంటే కొందరు మామిడి అమ్మకందారులు వాటిని కట్ చేసి.. రసం తీసి
చూపిస్తుంటారు. సహజసిద్ధమైన రీతిలో పండిన మామిడి పండ్ల గుజ్జు కాస్త ఎరుపు
కలిసిన పసుపు రంగులో ఉంటాయి. పైగా గుజ్జంతా ఒకే విధంగా ఉంటుంది. అదే కృత్రిమంగా
మగ్గిన పండైతే.. గుజ్జు లేత లేదా ముదురు పసుపు రంగులో ఉంటాయి. ఇది పండు
పూర్తిగా పక్వానికి రాలేదని తేలిసిపోతాయి.

మామిడి పండ్ల నుంచి రసం..

అయితే మామిడి పండ్లను గుర్తించడానికి మరో పద్దతి కూడా ఉంది. మీరు మామిడి
జ్యూస్ తీస్తున్నప్పుడు రసం చాలా తక్కువ మోతాదులో వచ్చిందా? అయితే అది
కృత్రిమంగా మగ్గబెట్టిన పండు అని గుర్తించాలి. పూర్తిగా పక్వానికి వచ్చి
సహజసిద్ధమైన రీతిలో మగ్గిన మామిడి పండులో రసం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా
తియ్యగా కూడా ఉంటుంది. ఎందుకంటే.. మామిడి పండును సహజసిద్ధంగా పండేలా చేసే
ఇథిలీన్ వల్ల పండులో రసం ఎక్కువగా ఉంటుంది.

ఇలా చేయండి..

ఇక తప్పదు.. అంతటా ఇవే దొరుకుతున్నాయి అని అనుకుంటే మీరు మరో చిట్కా
ఉపయోగించవచ్చు కొంతలో కొంత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ రసాయనాల ప్రభావం మన
శరీరంలోకి ప్రవేశించకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం
మమాడి పండ్లను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని నీటిలో మంచినీటిలో పోసి దానిలో
కాస్తా ఉప్పు వేయాలి. ఉప్పు పూర్తిగా కరిగిన తర్వాత అందులో మామిడి పండ్లు వేసి
అరగంటసేపు అలా ఉంచాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి మంచినీటిలో ఉన్న మరో పాత్రలో
వేసి పావుగంట అలా ఉంచాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి పొడిగా తుడిచి
భద్రపరుచుకోవాలి. వాటిని తినే ముందు రెండు నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో
కడిగి తొక్కు తీసి ఆ తర్వాత మాత్రమే తీసుకోవడం మంచిది.

Flash...   Transfers Revised Guidelines GO MS 190 Dt:21.12.2022

ALSO READ: 

ఎండాకాలం ఈ జబ్బుల ప్రమాదం ఎక్కువ.. జాగ్రత్త..!

ఈ విటమిన్ లోపిస్తే తలనొప్పి, అలసట తప్పవు..!

 ఐదు కారణాల వల్ల జుట్టు తెల్లబడుతోంది.. అవేంటో తెలుసుకొని పరిష్కరించుకోండి..!