NEW RULES FROM JUNE : జూన్ 1 నుంచి మారే అంశాలివే..! ఇక ప్రజల నుంచి భారీగా బాదుడు

Financial Changes From June 2022 :  జూన్ 1 నుంచి మారే అంశాలివే..! ఇక ప్రజల నుంచి  భారీగా బాదుడు

మరో రెండు రోజుల్లో కొత్త నెల జూన్ ప్రారంభం కాబోతుంది. కొత్త నెలలో కొన్ని ఆర్థిక అంశాలలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీనిలో ఎల్‌పీజీ సిలిండర్ల ధర మార్పు నుంచి బ్యాంకు సేవింగ్స్, ఎఫ్‌డీ అకౌంట్ల వడ్డీ రేట్ల వరకు ఉన్నాయి. మనం ఇప్పుడు జూన్ 1 నుంచి మారబోతున్న ఐదు ముఖ్యమైన ఆర్థిక అంశాలేమిటో ఓసారి ఇక్కడ చూద్దాం..

READ: రూ.29 పొదుపు చేస్తే రూ.4,00,000 పొందొచ్చు..! 

భారంగా SBI హోమ్ లోన్లు (SBI Home Loans)

ప్రభుత్వ రంగానికి చెందిన ఎస్‌బీఐలో మీరు ఇంటి రుణం తీసుకుని ఉంటే.. మీరు వచ్చే నెల ప్రారంభం నుంచి ఎక్కువ భారాన్ని భరించాల్సి వస్తుంది. అదనపు వడ్డీ రేటును చెల్లించాలి. ఒకవేళ కొత్తగా రుణం తీసుకోవాలి అనుకున్నా కూడా ఈ బ్యాంకు వడ్డీ రేట్లను మార్చింది అది గుర్తుంచుకోవాలి. ఎస్‌బీఐ తన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 7.05 శాతానికి తీసుకొచ్చింది.

READ: మీ డబ్బులు 5 ఏళ్లలో డబుల్ కావాలంటే ఈ 5 స్కీమ్స్ ఎంచుకోండి. 

పెరగనున్న మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం(Motor Insurance Premium)..

మీ వెహికిల్ ఇన్సూరెన్స్ ప్రీమియాలు కూడా వచ్చే నెల ప్రారంభం నుంచి పెరగబోతున్నాయి. కరోనా మహమ్మారి ముందు వరకు రూ.2,072గా ఉన్న 1000 సీసీ ఇంజిన్ కెపాసిటీ గల కార్ల ఇన్సూరెన్స్ ప్రీమియం.. ప్రస్తుతం రూ.2,094కు పెరగనుంది. అంతేకాక .. 1000 సీసీ నుంచి 1500 సీసీ వరకు ఇంజిన్లు గల కార్ల ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.3221 నుంచి రూ.3416కు పెరుగుతుంది.

READ: ఈ పాలసీ తీసుకుంటే 40 ఏళ్ల నుంచే పెన్షన్  

గోల్డ్ హాల్‌మార్కింగ్ అమలు(Gold Hallmarking)..

గోల్డ్ హాల్‌మార్కింగ్‌కు సంబంధించి రెండో దశ జూన్ 1 నుంచి అమలు కాబోతుంది. ప్రస్తుతం హాల్‌మార్క్ సెంటర్లు 32 కొత్త జిల్లాల్లో తెరుచుకోనున్నాయి. అంతకుముందు ఈ సెంటర్లను 256 జిల్లాల్లో తెరిచారు. ప్రస్తుతం 288 జిల్లాల్లో 20 నుంచి 24 క్యారెట్లకు చెందిన హాల్‌మార్క్‌డ్ గోల్డ్‌నే విక్రయిస్తున్నారు.

Flash...   Know your transfers Seniority and Rolls of Schools

యాక్సిస్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్(Axis Bank Savings Account)..

యాక్సిస్ బ్యాంకు తన సేవింగ్స్ అకౌంట్స్ ఛార్జీలను పెంచబోతుంది. ఈ పెంపు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఛార్జీలలో మినిమమ్ బ్యాలెన్స్‌లను నిర్వహించనందుకు విధించే ఛార్జీలతో పాటు అదనపు చెక్ బుక్ ఛార్జీలు కూడా ఉన్నాయి.

READ: సుకన్య సమృద్ధి యోజన పధకం గురించి పూర్తి వివరాలు

గ్యాస్ సిలిండర్ ధరలు(Gas Cylinder Prices)..

ప్రతి నెలా ఒకటవ తారీఖున గ్యాస్ సిలిండర్ ధరలను మారుస్తూ ఉంటాయి ఆయిల్ కంపెనీలు. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగా ఈ ధరలు పెరగడం తగ్గడం ఆధారపడి ఉంటుంది. తాజాగా డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరపై రూ.3.50 పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

ALSO READ: 

6 మంచి లాభదాయకమైన పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీలు…తక్కువ ప్రీమియం కూడా..!