Railway Jobs: రాత పరీక్ష లేకుండా.. రైల్వేలో 1044 ఉద్యోగాలు.. 10వ త‌ర‌గ‌తి పాస్ చాలు

 Railway Jobs: రాత పరీక్ష లేకుండా.. రైల్వేలో 1044 ఉద్యోగాలు.. 10వ త‌ర‌గ‌తి పాస్ అయితే చాలు.. పూర్తి వివరాలివే

Railway Jobs: ఇండియన్‌ రైల్వే (Indian Railways) మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR).. వివిధ ట్రేడ్‌లలో ఖాళీగా ఉన్న 1044 అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టులను నాగ్‌పూర్‌ డివిజన్‌ వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండా ప‌దోత‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తోనే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయనున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య: 1044

ఖాళీలున్న ప్రాంతాలు: నాగ్‌పూర్‌ డివిజన్‌–980, వర్క్‌షాప్‌ మోతీబాగ్‌–64.

ట్రేడులు: ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, మెషినిస్ట్, టర్నర్, డిజిటల్‌ ఫోటోగ్రాఫర్, హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, గ్యాస్‌ కట్టర్, స్టెనోగ్రాఫర్, కేబుల్‌ జాయింటర్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 01.05.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 03, 2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in/

Flash...   Amma Vodui latest Instructions 10.1.21