SBI బంపరాఫర్.. LIC IPO లో షేర్స్ కొనడానికి 20 లక్షల రూపాయల వరకు రుణాలు

 SBI Loans For LIC IPO: SBI బంపరాఫర్.. LIC IPO లో షేర్స్ కొనడానికి రుణాలు


SBI Loans For LIC IPO: ఎల్ఐసీ ఐపీవోలో ఎల్ఐసీ షేర్స్ కొనాలని ఉందా ? ఎల్ఐసిలో పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు లేవే అని దిగులు చెందుతున్నారా ? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మీకో అద్భుతమైన అవకాశం అందిస్తోంది. ఎల్ఐసి షేర్స్ కొనాలనుకుని పెట్టుబడి లేని వారి కోసం ఎస్బీఐ ప్రత్యేకంగా రుణాలు అందిస్తోంది. అది కూడా ఒకటి లేదా రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ. 20 లక్షల వరకు రుణం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 

READ:SBI బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రూ.8,00,000 లోన్…  మరోసారి ఆఫర్  

మే 4న ఎల్ఐసీ ఐపీఓ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎల్ఐసీ ఐపీఓ కోసం ఔత్సాహిక పెట్టుబడిదారులు దాదాపు ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. గతేడాదే ఐపీఓకు రావాల్సిన ఎల్ఐసీ.. మార్కెట్‌లో ఒడిదుడుకులతో పాటు పలు ఇతర అనివార్య కారణాలరీత్యా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు తాజాగా మే 4వ తేదీన ప్రారంభమైన ఎల్ఐసీ ఐపీఓ.. మే 9వ తేదీన ముగియనుంది. అంటే ఎల్ఐసీలో షేర్స్ కొనాలనుకునే వారికి చివరి తేదీ గడువు రేపటితో ముగియనుందన్నమాట. అలాగే ఎల్ఐసీ ఐపీఓకు దరఖాస్తు చేసుకున్న వారికి మే 12న షేర్స్ కేటాయించనున్నారు. మీరు కొనుగోలు చేసిన ఎల్ఐసీ షేర్స్ మే 17న ఎన్ఎస్ఈ, బిఎస్ఈలో లిస్ట్ అవనున్నాయి.

ఇదిలావుంటే, ఎల్ఐసి షేర్స్ కొనాలని ఉవ్విళ్లూరుతూ.. పెట్టుబడి లేని కారణంగా ఆ పని చేయలేకపోతున్న వారికి తాజాగా ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కాకపోతే ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవడానికంటే ముందుగా తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. ఈ గుడ్ న్యూస్ అందరికీ కాకుండా కేవలం ఎల్ఐసి సంస్థలో పనిచేస్తోన్న సిబ్బందికి మాత్రమే వర్తిస్తుంది. అలాగని మిగతా వారు డిజప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే వారికి కూడా ఓ మార్గం ఉంది. 

Flash...   EPFO | అధిక పెన్షన్ పొందేందుకు ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి?

అవును.. ఎల్ఐసి ఐపీఓలో షేర్స్ కొనాలనుకునే ఎల్ఐసి సిబ్బందికి 20 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణం ఇచ్చేందుకు ఎస్‌బీఐ ముందుకొచ్చింది. ఎస్‌బీఐ అందిస్తున్న ఈ పర్సనల్ లోన్‌కి చార్డ్ చేసే వడ్డీ రేటు కూడా తక్కువే. కేవలం 7.10 వడ్డీ రేటుతో ఎల్ఐసి ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పర్సనల్ లోన్ అందిస్తోంది. మరి ఎల్ఐసి సిబ్బంది కాని వారి సంగతి ఏంటంటారా.. ? అక్కడికే వస్తున్నాం. ఎల్ఐసీలో ఉద్యోగంతో సంబంధం లేకుండా ఐపీఓలో షేర్స్ కొనాలనుకునే వారికి కూడా రూ. లక్షల వరకు ఎస్‌బీఐ పర్సనల్ అందిస్తోంది. కాకపోతే ఈ పర్సనల్ లోన్స్‌కి (SBI Personal Loans In Minutes) 9.85 వడ్డీ రేటు చార్జ్ చేస్తోంది.

LOAN  అప్లై చేయుటకు ఇక్కడ క్లిక్ చేయండి 

ALSO READ: