SSC LEAKS: పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్

PONGURU NARYANA ARRESTED FOR SSC PAPERS LEAK IN AP 

పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో  మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ 

హైదరాబాద్‌: తెదేపాకు చెందిన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఐడీ పోలీసులు.. నారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు.

ఇటీవల ఏపీలో పదోతరగతి ప్రశ్నపత్రాలు వరుసగా లీక్‌ అయ్యాయి. ఈ వ్యవహారం వెనుక నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు ఉన్నట్లు కొద్దిరోజుల క్రితం తిరుపతి సభలో సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌ వచ్చి నారాయణను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

BREAKING: CID Arrest Former Andhra Minister Narayana Rao In SSC Paper Leak Case

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అరెస్ట్‌ అయ్యారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత 4 రోజులుగా ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి నారాయణ అజ్ఞాతంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్‌ నుంచి టెన్త్‌ పేపర్లు లీకైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

Flash...   Extension of summer vacation for Classes I to X up to 30th June, 2021