SSC PAPERS LEAKS: అధికారులే లీకు వీరులు! టెన్త్ నాలుగో పరీక్షలోనూ ప్రశ్నపత్రాలు లీకు

అధికారులే లీకు వీరులు! టెన్త్ నాలుగో పరీక్షలోనూ ప్రశ్నపత్రాలు లీకు

• ఏలూరులో మ్యాథ్స్ పేపర్ బయటకు

• ముగ్గురిపై క్రిమినల్ కేసు

• రాష్ట్రవ్యాప్తంగా 3 చోట్ల ఘటనలు

• కృష్ణా జిల్లాలో ఐదుగురు టీచర్ల  ప్రమేయం 

• కర్నూలులో పేపర్ లీక్కే సుల్లో 27 మంది అరెస్టు : ఆరుగురికి రిమాండ్

అమరావతి, ఆంధ్రప్రభ : పదో తరగతి పరీక్షల్లో లీకులు ఆగడం లేదు.

ప్రభుత్వం ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధికారుల్లో భయం రావడం లేదు, అందుకే నాలుగో పరీక్షలోనూ వేర్వేరు చోట్ల క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి. మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మ్యాథమెటిక్స్ పరీక్ష జరిగింది. మొదటి మూడు పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు వాట్సప్ ద్వారా బయటకు వచ్చి, సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది. తొలిమూడు పరీక్షల్లో చిత్తూరు, నంద్యాల, శ్రీకాకు ళం జిల్లాల్లో ప్రశ్న పత్రాలు బయటకు రావడంతో బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలతోపాటు బయటి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అలాగే విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ సైతం ప్రెస్మీట్ నిర్వహించి, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠినంగా వ్యవహ రిస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ నాలుగో పరీక్షైన మ్యాథమె ప్రశ్నాపత్రం ఏలూరు జిల్లాలో లీకైంది. అయితే ఈ ఘటనకు పాల్పడింది ఇంటిదొంగలేనని గుర్తించిన జిల్లా విద్యాశాఖాధికారి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయ డమే కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఏలూ రుజిల్లాలో లెక్కల పరీక్ష ప్రశ్నాపత్రాన్ని పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ విజయ్కుమార్, డిపార్ట్ మెంట్ ఆఫీసర్ రామాంజనేయ వరప్రసాద్, ఇన్విజిలేటర్ ప్రదీప్ కలిసి కార్బన్ కాపీ తీసుకున్నారు. అనంతరం అందులోని ప్రశ్న లకు సమాధానాలు తయారు చేస్తున్న క్రమంలో సమా చారం బయటకు పొక్కింది. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని సిబ్బందితో కలిసి పరీ క్షా కేంద్రంపై ఆకస్మికంగా తనిఖీకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ సూచనల మేరకు వీరి ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. శాఖాపరమైన చర్యలలో భాగంగా ముగ్గురినీ సస్పెండ్ చేశారు.

Flash...   Field visits of Principal Secretary - Certain instructions to HMs and Staff