UNIQUE LOGINS: పాస్‌వర్డ్‌కు సెలవు.. అన్ని సైట్లు, యాప్‌లకు యూనిక్‌ లాగిన్‌

 UNIQUE LOGINS పాస్‌వర్డ్‌కు సెలవు.. అన్ని సైట్లు, యాప్‌లకు యూనిక్‌ లాగిన్‌

భవిష్యత్తులో పాస్‌వర్డ్‌లెస్‌ సేవలు

ఫిడో, డబ్ల్యూ3సీతో జట్టుకట్టిన యాపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌

అన్ని సైట్లు, యాప్‌లకు యూనిక్‌ లాగిన్‌

వచ్చే ఏడాది నుంచే అందుబాటులోకి..

న్యూఢిల్లీ, మే 6: ప్రపంచవ్యాప్తంగా ప్రతీవారం సగటున 10 లక్షల పాస్‌వర్డ్‌లు హ్యాక్‌కు గురవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ప్రధానంగా వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే ఎక్కువని పేర్కొంటున్నాయి. అయితే, ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఈ-మెయిల్‌, బస్‌ టికెట్‌ బుకింగ్‌ ఇలా ప్రతీ డివైజ్‌, సైట్‌, యాప్‌లోకి ఎంటర్‌ కావడానికి పాస్‌వర్డ్‌ లేని లాగిన్‌ వ్యవస్థ ఉంటే ఎలా ఉంటుంది? అప్పుడు హ్యాకింగ్‌ గొడవ ఉండదు కదూ. ఆ దిశగానే ప్రధాన టెక్‌ దిగ్గజాలు యాపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ దృష్టిసారించాయి. ‘పాస్‌వర్డ్‌లెస్‌ సైన్‌ఇన్‌’ టెక్నాలజీని తీసుకొస్తున్నాయి.

ఏమిటీ టెక్నాలజీ?

విండోస్‌, క్రోమ్‌ఓఎస్‌, మ్యాక్‌ఓఎస్‌ వంటి భిన్న డివైజ్‌లలో యాప్స్‌, వెబ్‌సైట్లలో ఒకేసారి లాగిన్‌ అయ్యే అత్యంత సురక్షితమైన ఏకైక వ్యవస్థను ఏర్పాటు చేసేదే ‘పాస్‌వర్డ్‌లెస్‌ సైన్‌ఇన్‌’ టెక్నాలజీ. ఒక్కసారి లాగిన్‌ అయితే, మరోసారి క్రెడెన్షియల్స్‌ను ఎంటర్‌ చేయాల్సిన అవసరంలేదు. ఒక్కసారి లాగిన్‌ అయితే అన్ని సైట్లు, యాప్‌లకు యాక్సెసింగ్‌ లభిస్తుంది. పనిపూర్తయిన తర్వాత లాగవుట్‌ అవ్వొచ్చు. ఒక్కోసైట్‌కు ఒక్కో పాస్‌వర్డ్‌ అనే ప్రసక్తే ఉండదు.

READ: Postal Jobs: 38926 JOBS in the Postal Department

ఎలా లాగిన్‌ అవ్వాలి?

ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌లో లాగిన్‌ కావడానికి వినియోగిస్తున్న ఫేస్‌ స్కానింగ్‌, ఫింగర్‌ప్రింట్‌, కోడ్‌ మార్కింగ్‌ విధానాల ద్వారా ‘పాస్‌వర్డ్‌లెస్‌ సైన్‌ఇన్‌’ టెక్నాలజీలోకి లాగిన్‌ కావొచ్చు. అయితే, మీరు లాగిన్‌ కావాలనుకొన్న డివైజ్‌లో ఫిడో, డబ్ల్యూ3సీ అభివృద్ధి చేసిన ప్రత్యేక ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. భద్రతాపరంగా ఇది ఎంతో సురక్షితమైంది. ఈ సాఫ్ట్‌వేర్‌కు యాపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ మరిన్ని ఫీచర్లు జోడించి వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురానున్నారు.

Flash...   FD కంటే ఎక్కువ వడ్డీ రేటు కావాలా? ఇది చదవండి !

ఎందుకు తీసుకొచ్చారు?

ఈ-మెయిల్‌, బ్యాంకింగ్‌ వంటి సేవల కోసం లాగిన్‌ కావడానికి ప్రతీ సైట్‌కు, యాప్‌కు ఒక్కో పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకోవడం కష్టంగా ఉందనుకొనేవారు అన్నింటికీ కలిపి సులువైన పాస్‌వర్డ్‌ను పెట్టుకొంటున్నారు. నార్డ్‌పాస్‌ రిసెర్చ్‌ సంస్థ లెక్కల ప్రకారం.. ‘123456’ అనే నంబర్‌ను పాస్‌వర్డ్‌గా 29,401 కంపెనీల సీఈవోలు పెట్టుకొన్నారు. ఇలా సులభమైన, ఈజీగా కనిపెట్టే పాస్‌వర్డులను పెట్టుకోవడంతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే.. అసలు పాస్‌వర్డ్‌ లేని లాగిన్‌ వ్యవస్థను తీసుకురావాలని Fast ID Online (FIDO), వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ కన్సార్టియమ్‌ (W3C) గతంలో నిర్ణయించాయి. తాజాగా ఈ నిర్ణయానికి యాపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ మద్దతు ప్రకటించాయి.