Vitamin D: మహిళల్లో ఈ 4 లక్షణాలుకనిపిస్తే అది విటమిన్ D లోపం కావచ్చు

Vitamin D: మహిళల్లో ఈ 4 లక్షణాలుకనిపిస్తే అది విటమిన్ D  లోపం కావచ్చు

Vitamin D: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్‌ డి చాలా ముఖ్యం. వయస్సుతో పాటు మహిళల శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భధారణ సమయంలో విటమిన్ డి లోపం ఉంటే తల్లి, బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ పరిస్థితిలో మహిళలు విటమిన్ డి తీసుకోవాలి. ఉదయం సూర్యకాంతి నుంచి శరీరానికి విటమిన్ డి అందుతుంది. మీరు ఎండలో కూర్చోలేకపోతే విటమిన్ డి ఉన్న ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. మహిళల్లో విటమిన్ డి లోపం వల్ల ఎముకల నొప్పులు, కీళ్ల నొప్పులు, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే శరీరంలో విటమిన్ డి లోపం ఉందని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

1. తొందరగా అనారోగ్యానికి గురికావడం

శరీరంలో విటమిన్ డి లేని స్త్రీల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. వ్యాధులు, వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి తగ్గుతుంది. విటమిన్ డి లోపం తరచుగా ఫ్లూ, జ్వరం, జలుబు, దగ్గుకి దారితీస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతంగా ఉండాలంటే శరీరంలో విటమిన్ డి లోపం ఉండకూడదు.

2. ఎముకలలో నొప్పి

శరీరంలో ఎముకలు దృఢంగా ఉండటానికి కాల్షియం, విటమిన్ డి అవసరం. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి తగ్గడం వల్ల ఎముక సాంద్రత కూడా తగ్గుతుంది. ఇది ఎముక పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

3. అలసట, బలహీనత

తరచుగా మహిళలు అలసిపోతారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో విటమిన్ డి లేకపోవడమే. రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో అలసట ఉంటుంది. దీని కారణంగా ఎల్లప్పుడూ అలసట, బలహీనంగా అనిపిస్తుంది.

4. గాయాలు మానవు

శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే గాయం, శస్త్రచికిత్స గాయాలు ఆలస్యంగా మానిపోతాయి. ఇవి విటమిన్ డి లోపానికి సంకేతాలు. శరీరంలో విటమిన్ డి స్థాయి తక్కువగా ఉంటే గాయాలు ఆలస్యంగా నయం అవుతాయని గుర్తుంచుకోండి.

ALSO READ: 

అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Flash...   కరోనా డేంజర్‌ బెల్స్‌.. ముందుంది అసలు కథ