CM JAGAN : తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష- బైజూస్‌తో ఒప్పందం– ముఖ్యాంశాలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష

సాక్షి, అమరావతి: ప్రపంచంతో పోటీపడే విధంగా, ఉజ్వల భవిష్యత్తు ఉన్న పిల్లలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగువేసింది. నాడు–నేడు, ఇంగ్లీషు మీడియం, ద్విభాషలతో కూడిన పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక, అమ్మ ఒడి, గోరుముద్దలాంటి కార్యక్రమాలతో విద్యారంగంలో చరిత్ర సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయంగా ప్రస్దిద్ధి చెందిన సుప్రసిద్ధ ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’తో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం సమక్షంలో కమిషనర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఎస్‌.సురేష్‌కుమార్, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పబ్లిక్‌పాలసీ హెడ్‌ సుస్మిత్‌ సర్కార్‌ సంతకాలు చేశారు. వర్చువల్‌ పద్ధతిలో ‘బైజూస్‌’ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్‌ అమెరికా నుంచి పాల్గొన్నారు.

రాష్ట్రంలో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సందర్భంగా వివిధ యూనికార్న్‌ కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలు, కీలక అధికారులతో సీఎం సమావేశమయ్యారు. అక్కడే బైజూస్‌ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌తో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా నేర్చుకునేలా ఇ–లెర్నింగ్‌ కార్యక్రమంపై నిశితంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ రవీంద్రన్‌ చెప్పారు.

ఈ చర్చల ఫలితంగా.. ఇవాళ బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఇప్పటివరకూ కొందరికే పరిమితమైన ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ విద్య ఇకపై ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు కూడా అందుబాటులోకి రానుంది. ఏడాదికి కనీసం రూ.20వేల నుంచి రూ.24వేలు చెల్లిస్తేకాని ‘బైజూస్‌’ ఇ– తరగతులు విద్యార్థులకు అందుబాలోకి రావు. అలాంటి నాణ్యమైన విద్య ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. పేదరికం అన్నది నాణ్యమైన చదువులకు అడ్డం కాకూడదనే సంకల్పంతో వైఎస్‌ .జగన్‌ సర్కార్‌ ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ టి విజయకుమార్‌ రెడ్డి, ఇంటర్‌మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎంవీ శేషగిరిబాబు, ఎస్‌ఎస్‌ఏ ఎస్‌పీడీ వెట్రిసెల్వి, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (పబ్లిక్‌ పాలసీ) సుస్మిత్‌ సర్కార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

DOWNLOAD BYJU’S APP

LOGIN TO BYJU’S FREE CLASSES

ఎంఓయూ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

►రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్‌ భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరం

►పేదపిల్లల జీవితాలను ఇది మారుస్తుంది

►ఈ ప్రక్రియలో మీరు భాగస్వామ్యం కావడం అన్నది చాలా గొప్ప ఆలోచన

►మంచి చదువులను నేర్చుకునే విషయంలో పిల్లలను ముందుండి నడిపించడం అన్నది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన ఉద్దేశం

►పదోతరగతిలో ఆంగ్లమాధ్యమంలో సీబీఎస్‌ఈ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇది దోహదపడుతుంది

Flash...   S.S.C Public Examinations April / May 2022 - Certain Instructions

►ఇక్కడున్న మా అందరి కలలు సాకారం కావడానికి బైజూస్‌ భాగసామ్యం గొప్ప బలాన్నిస్తుంది

►బైజూస్‌ ద్వారా అందే నాణ్యమైన కంటెంట్, పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దిన విజువలైజేషన్‌ ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది

►విద్యారంగంలో ఇదొక మేలిమలుపు, ఇది ఒక గేమ్‌ ఛేంజర్‌

►పెద్ద పెద్ద ప్రయివేటు స్కూళ్లలో, ఏడాదికి రూ.20వేల నుంచి 24వేల వరకూ చెల్లించి సబ్‌స్క్రైబ్‌చేసుకుంటే లభించని బైజూస్‌ కంటెంట్‌ ప్రభుత్వ స్కూళ్లలోని పేద పిల్లలకు అందుబాటులోకి వస్తుంది

►ప్రస్తుతం 8 తరగతి చదువుతున్న విద్యార్థులు.. తమ 10వ తరగతి పరీక్షలను సీబీఎస్‌నమూనాలో రాస్తారు

►వీరిని ముందుండి నడిపించడానికి ట్యాబ్‌లు కూడా ఇస్తాం

►డిజిటల్‌ పద్ధతుల్లో నేర్చుకునే విధానం, అభ్యసనం∙అన్నీకూడా పిల్లలకు అందుబాటులోకి వస్తాయి

►దీనివల్ల వీళ్లు తమ పదోతరగతి సీబీఎస్‌ పరీక్షలను సులభంగా ఎదుర్కొంటారు

►టీచర్లకు కూడా మంచి శిక్షణ లభిస్తుంది

►తమ బోధనను మరింత నాణ్యంగా అందించగలరు

►ట్యాబ్‌లకోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు అవుతుంది

►ఈ సెప్టెంబరులోనే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నాం

►బైజస్‌ నుంచి అందుతున్న భాగస్వామ్యం చాలా అమూల్యమైనది

►విద్యా రంగ వ్యవస్థలను మరింత మెరుగ్గా తీర్చదిద్దడానికి బైజూస్‌ సీఈఓ రవీంద్రన్‌ లాంటివారు ముందుకు రావడం శుభ పరిణామం

►దీనికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

►మరోసారి బైజూస్‌ రవీంద్రన్‌తో సమావేశమై ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంపై దృష్టిపెడతాం

►స్విట్జర్లాండ్‌లో రవీంద్రన్‌తో జరిగిన సమావేశం అంశాలు నాకు గుర్తున్నాయి

►సానుకూల దృక్పథంతో ముందుకు రావడం చాలా సంతోషకరం

MOU సందర్భంగా బైజూస్‌ రవీంద్రన్‌ ఏమన్నారంటే..

►ముఖ్యమంత్రిగారి వేగం అనూహ్యమైనది

►ఆయన వేగంగా స్పందించిన తీరు మా అందరికీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది

►మే 25న ఆయనతో ఆయనతో నేను తొలిసమావేశం (దావోస్‌లో)జరిపాను

►ఒక యంగ్‌స్టార్టప్‌కన్నా.. వేగంగా అడుగులు ముందుకు వేయడం హర్షణీయం

►ఆయన చూపిన వేగం.. నమ్మశక్యంకానిది

►ఎందుకంటే కొద్దిరోజుల కిందటే మా తొలి సమావేశం జరిగింది

►ఆ సమయంలో ఆయనిచ్చిన అవకాశం మమ్మల్ని ఎంతగానో ఉత్సాహపరిచింది

►ప్రైవేటు స్కూళ్లలో, ఇతరులు అందుబాటులో ఉంటే అదే కంటెంట్‌ను ఎలాంటి వ్యత్యాసం లేకుండా ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకూ అందుబాటులోకి తీసుకు వస్తున్నారు

►ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నవారికి దీన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల దీనివల్ల సానుకూల ఫలితాలు ఏంటన్నది బాగా తెలుసు

►పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి ముఖ్యమంత్రిగారు వడివడిగా అడుగులు వేయడం మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది.ఇది చాలా గొప్ప ముందుడుగు

►సమాజంలో గొప్పస్థానం కేవలం విద్యద్వారానే సాధ్యం

►ప్రతి విద్యార్థిలో ఉన్న సమర్థత వెలికి తీయబడుతుంది, ఇదే వారి జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఈ దిశగానే మేం అడుగులు వేస్తున్నాం

►ప్రపంచంలోనే అతి పెద్ద ఎడ్యు టెక్‌ కంపెనీగా మాకు సామాజిక బాధ్యతకూడా ఉంది

►నాట్‌ ఫర్‌ ప్రాఫిట్‌…. లాభాలు కోసం కాకుండా మంచి చేయడానికి కూడా మాకు ఇదొక చక్కటి అవకాశం

►లక్షలమంది విద్యార్థులు దీనివల్ల లబ్ధి పొందుతారు. వచ్చే 20–30 ఏళ్లపాటు పిల్లల జీవితాలు అత్యంత ప్రభావితమవుతాయి

Flash...   జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? ..ఈ ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు?

►ముఖ్యమంత్రిగారి మార్గం మిగతావారికి కూడా అనుసరణీయం

ఆతర్వాత అధికారులతో రివ్యూ సందర్భంగా బైజూస్‌తో ఒప్పదంపై సీఎం మాట్లాడారు, కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..

►రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఇదో గొప్ప మైలురాయి

►పిల్లకు అత్యంత నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం

►పెద్దపెద్ద స్కూళ్లలో, ప్రైవేటు విద్యార్థులు ఇదే బైజూస్‌ను తీసుకోవాలంటే ఒక్కో విద్యార్థి ఏడాదికి రూ.20వేల నుంచి రూ.24వేలు పెడితే కాని… ఈ కంటెంట్‌ అందుబాటులోకి రాదు

►అలాంటి ఇవాళ ఈ కంటెంట్‌ అంతా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పిల్లల అందరికీ అందుబాటులోకి రావడం సంతోషకరం. ఇదొక గొప్ప మలుపు

►విద్య అన్నది మరింత సమర్థవంతంగా, మరింత నాణ్యంగా అందుతుంది

►ఇప్పుడే మనం ఎంఓయూ ఎంటర్‌ అయ్యాం కాబట్టి.. వచ్చే విద్యా సంవత్సరం నాటికి బైజూస్‌ కంటెంట్‌ అంతా ఇంగ్లిషు, తెలుగు మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తీసుకు వస్తాం. దీనిమీద అధికారులు దృష్టిసారించాలి

►విజువల్‌ప్రజంటేషన్లనుకూడా పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతి తరగతి గదిలోకూడా టీవీని పెట్టాలి

►నాడు – నేడు కింద ఈ టీవీని తరగతి గదుల్లో పెట్టండి. దీనివల్ల బైజూస్‌ ఇస్తున్న విజువల్‌ కంటెంట్‌ పిల్లలకు సులభంగా అందుబాటులోకి ఉంటుంది

►వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఇవన్నీ చేయాలి

►మరోవైపున 8వ,9వ, 10వ తరగతులు చాలా ముఖ్యమైనవి

►పిల్లలు మంచి మంచిఫలితాలు సాధించాలంటే.. ఇవి చాలా ముఖ్యమైనవి

►2025 మార్చి నాటికి పిల్లలంతా పదోతరగతి పరీక్షలను ఇంగ్లిషు మాధ్యమంలో సీబీఎస్‌ నమూనాలో పరీక్షలు రాస్తారు

►ఈ విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందాలి

►అంతేకాక వారికి ముందుకు నడిపించేట్టుగా ఉండాలి

►అందుకే 8 వ తరగతిలో అడుగుపెట్టే ప్రతి విద్యార్థికీ ట్యాబ్‌కూడా ఇస్తున్నాం

►ఇవాళే ఎంఓయూ చేసుకున్నాం కాబట్టి, సెప్టెంబరు నాటికల్లా.. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌ ఇస్తున్నాం

►మొత్తంగా 4,70,000 మంది పిలల్లు 8వ తరగతిలోకి అడుగుపెడుతున్నారు

►వీరందరికీ ట్యాబ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాం

►ఈ ట్యాబ్స్‌ ద్వారా డిజిటిల్‌ పద్ధతుల్లో చదువులు సునాయసంగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది

►ఈ 8వ తరగతి పిల్లలు 9వ తరగతిలోకి వెళ్లేసరికి 9 వ తరగతికి సంబంధించి పాఠాలకు సంబంధించిన కంటెంట్‌ డౌన్లోడ్‌ అవుతుంది

►మళ్లీ వీళ్లు 10వ తరగతికి వచ్చే సరికి.. 10వ తరగతికి పాఠాలకు సంబంధించిన కంటెంట్‌ను ట్యాబ్‌లో డౌన్లోడ్‌ చేస్తారు

►ఇలా ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు కొత్తగా ట్యాబ్‌లు ఇస్తాం

►8వ తరగతిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ట్యాబ్‌లు ఇస్తాం

►రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్‌ భాగస్వామ్యం కావడం అన్నది చాలా పెద్ద ఎచీవ్‌మెంట్‌

►నేను అడిగిన వెంటనే బైజూస్‌ వాళ్లు చాలా సానుకూలంగా స్పందించారు

►ఇంత కంటెంట్‌ఇవ్వడానికి ముందుకు రావడం కూడా చాలా మంచి పరిణామం

►ట్యాబ్‌లమీదే మనకు ఖర్చు అవుతుంది

►కంటెంట్‌ విషయంలో బైజూస్‌ నాలుగు అడుగులు ముందుకేసి ప్రభుత్వానికి సహకరించడానికి ముందుకు వచ్చింది

Flash...   All Important Useful Links

►ఏడాదికి ట్యాబ్‌ల రూపంలో కనీసంగా రూ.500 కోట్లు అవుతుంది

►ఇంత ఖర్చు అయినాకూడా నాణ్యమైన విద్య దిశగా ఇదో పెద్ద ముందడుగు

►టీచర్లకు కూడా శిక్షణ అందుతుంది, వారు నిరంతరం అప్‌గేడ్‌ అయ్యేందుకు ఉపయోగపడుతుంది

►నా జీవితంలో ఇదొక ఫైనస్ట్‌మూమెంట్‌గా భావిస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది

►ప్రైవేటు పిల్లలకు, ప్రభుత్వ పిల్లలకు వ్యత్యాసం లేకుండా.. అదే క్వాలిటీ విద్య.. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు అందుబాటులోకి వస్తుంది

బైజూస్‌తో అవగాహన ఒప్పందం– ముఖ్యాంశాలు

►ప్రభుత్వం స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ విద్యను అభ్యసిస్తున్న పిల్లల సంఖ్య దాదాపుగా 32 లక్షలమంది ఉన్నారు. 

►బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం కారణంగా వీరందరికీ లెర్నింగ్‌ యాప్‌ద్వారా నాణ్యమైన విద్య అందుతుంది.

► 2025 నాటి పదోతరగతి విద్యార్థులు, అంటే ఇప్పటి 8వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ నమూనాలో పరీక్షలు రాస్తారు. వీరిని సన్నద్ధంచేసేందకు వీలుగా ఈ యాప్‌తోపాటు అదనంగా ఇంగ్లిషు లెర్నింగ్‌యాప్‌కూడా ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. నేర్చుకోవడానికి వీరికి ట్యాబ్‌కూడా సమకూర్చనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 4.7 లక్షల మంది విద్యార్థులు దీనివల్ల లబ్ధి పొందనున్నారు.

►బైజూస్‌లో లెర్నింగ్‌యాప్‌లో బోధన అంతా అత్యంత నాణ్యంగా ఉంటుంది. యానిమేషన్‌ ద్వారా, బొమ్మల ద్వారా విద్యార్థులకు మరింత సులభంగా, క్షుణ్నంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది.

►మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ స్టడీస్‌ ఈ సబ్జెక్టులన్నీకూడా ఇటు ఇంగ్లిషులోనూ, ఇటు తెలుగు మాధ్యంలోనూ కూడా అందుబాటులో ఉంటాయి. ద్విభాషల్లో పాఠ్యాంశాలు ఉండడం వల్ల పిల్లలు సులభంగా నేర్చుకునేందుకు, భాషాపరమైన ఆటంకాలు లేకుండా విషయాన్ని అర్థంచేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

►వినూత్న, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంల్ల వీడియో పాఠ్యాంశాలు అత్యంత స్పష్టతతో, నాణ్యతతో ఉంటాయి.

►విద్యార్థులు ఎంతవరకూ నేర్చకున్నారన్నదానిపై ప్రతి ఒక్కరికీ కూడా ఫీడ్‌ బ్యాక్‌ పంపుతారు. ఇది పిల్లలకు ఎంతో ఉపయోగం.

►సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగా మ్యాపింగ్‌చేస్తూ యాప్‌లో పాఠ్యాంశాలకు రూపకల్పనచేశారు. సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళికను అనుసరించి ప్రతి సబ్జెక్టులోని ప్రతి అధ్యాయంలో కూడా వివిధ అంశాలపై ప్రశ్నావళి ఉంటుంది. 

►4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం సులభంగా అర్ధంచేసుకునేందుకు వీలుగా ఇంటరాక్టివ్‌ గేమ్స్‌కూడా యాప్‌లో ఉంటాయి. ఏ తరహా పరిజ్ఞానం ఉన్న విద్యార్థి అయినా యాప్‌ద్వారా సులభంగా పాఠాలు నేర్చుకోవచ్చు.

►పునశ్చరణ చేసుకునేలా, నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనావేసేందుకు, అభ్యసనం కోసం వెనువెంటనే ప్రశ్నలు, వీడియోలు, ప్రశ్నలు, గేమ్స్, సిమ్ములేషన్స్‌.. ఇవన్నీకూడా యాప్‌లో పొందుపరిచారు.

►6 నుంచి 8వ తరగతివరకూ మ్యాథ్స్‌లో ఆటో సాల్వర్‌ స్కాన్‌ క్వశ్చన్స్‌ (లైవ్‌ చాట్‌ పద్ధతిలో ద్వారా నేరుగా…), స్టెప్‌ బై స్టెప్‌ సొల్యూషన్స్‌… ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బైజూస్‌ యాప్‌ద్వారా లభిస్తాయి.

►తరచుగా సాధన చేయడానికి వీలుగా మాదిరి ప్రశ్నపత్రాలు కూడా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.

►విద్యార్థి నేర్చుకున్న ప్రగతిపై నెలవారీగా ప్రోగ్రెస్‌ రిపోర్టులుకూడా ఇస్తారు. ఆన్లైలో ఉపాధ్యాయుడితో మీటింగ్‌కూడా ఉంటుంది.