Four Day Week: కొత్త చట్టాలు అమలైతే 4 రోజులు పని.. 3 రోజులు లీవు

4 రోజులు పని.. 3 రోజులు లీవు.. రోజుకు 8 గంటలకు బదులుగా 12 గంటలు వర్క్‌

న్యూఢిల్లీ, జూన్‌ 11: కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కార్మికుల పని గంటలు, సెలవుల విధానాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి పార్లమెంటు కిందటేడాది నాలుగు కార్మిక చట్టాలకు (వేతనాల కోడ్‌, ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ కోడ్‌, సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల చట్టం) ఆమోదం తెలిపింది. అయితే ‘కార్మికులు’ అనేది రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలోని అంశం. కాబట్టి కేంద్రం చట్టాలకు అనుగుణంగా రాష్ర్టాలు తమ నిబంధనల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

READ: AP SSC 2022 Marks Memos DOWNLOAD Process

ఈ కారణంగా చట్టాల అమలు ఆలస్యమవుతున్నది. ఇంకా కొన్ని రాష్ట్రాలు  తమ పరిధిలోని ఉద్యోగుల పనిగంటలు, సెలవులు, వేతనాలపై కేంద్ర చట్టాలకు అనుగుణంగా నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉన్నది. రాష్ట్రలన్నీ కేంద్ర చట్టాలకు అనుగుణంగా రూల్స్‌ తయారు చేస్తే ఈ జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమలు అవుతాయని అంచనా.

కేంద్ర స్థాయిలో ఉద్యోగుల పనిగంటలు, లీవులు ఫ్యాక్టరీల చట్టం -1948 ప్రకారం ఉంటాయి. రాష్ర్టాల పరిధిలో షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం ప్రకారం ఉంటాయి. కొత్త లేబర్‌ కోడ్‌లు అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ర్టాలు తమ పరిధిలో ఉద్యోగులు, కార్మికుల పనిగంటలను చట్టాలకు లోబడి ఎలాగైనా మార్చుకోవడానికి వెసులుబాటు ఉందని కేంద్రం చెప్తున్నది

కొత్త చట్టాలు అమలైతే రానున్న మార్పులు..

1. పనిగంటలు: కొత్త కార్మిక చట్టాల్లో ప్రధానమైన అంశం ఇదే. ఏ సంస్థలోనైనా కార్మికులు నాలుగు రోజులు పనిచేసి మూడు రోజులు సెలవు తీసుకోవడానికి ఈ చట్టాలు అనుమతిస్తున్నాయి. అయితే, ఇప్పుడున్నట్టు రోజుకు 8 గంటలు కాకుండా 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఏకబిగిన మూడు రోజులు సెలవులు ఇవ్వడం వల్ల ఉద్యోగులు మానసికంగా ఉల్లాసంగా ఉండి ఉత్పాదతకత పెరుగుతుందని కొంత మంది వాదిస్తుండగా.. వరుసగా నాలుగు రోజుల పాటు రోజుకు 12 గంటల చొప్పున పనిచేస్తే కార్మికుల శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Flash...   Transfers Confusion in Teachers

READ: AP TET 2022 Notification Released

2. వేతనం: కొత్త లేబర్‌ చట్టాల ప్రకారం కార్మికుడి మూల వేతనం(BASIC) మొత్తం(GROSS) జీతంలో సగం ఉండాలి. ప్రస్తుతం అన్ని కంపెనీల్లో బేసిక్‌ తక్కువగా, అలవెన్సులు ఎక్కువగా చూపించి పీఫ్‌లో తక్కువ జమ చేస్తున్నారు. బేసిక్‌, డీఏ ఆధారంగా పీఎఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ను నిర్ణయిస్తారు. కొత్త చట్టాలు అమల్లోకి వస్తే కంపెనీ, ఉద్యోగి జమ చేయాల్సిన పీఎఫ్‌ వాటా పెరుగుతుంది. దీంతో టేక్‌ హోం శాలరీ తగ్గుతుంది. టేక్‌ హోం శాలరీ తగ్గితే, ప్రస్తుతం మండిపోతున్న ధరలతో సామాన్యులు ఎలా బతుకుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

READ: టీచర్ల rationalization  Norms G O M S 117 విడుదల

3. సెలవులు: ఏదైనా కంపెనీలో చేరిన ఉద్యోగి ఆర్జిత సెలవులు(ELs) పొందాలంటే ప్రస్తుతం 240 రోజులు ఆగాలి. కొత్త లేబర్‌ కోడ్స్‌ ప్రకారం దీన్ని 180 రోజులకు తగ్గించారు. ఉద్యోగి పనిచేసిన ప్రతీ 20రోజులకు ఒక EL లభిస్తుంది. దీంతో పాటు కార్మికుల ఓవర్‌ టైమ్‌ పరిమితిని కూడా పెంచారు. ప్రస్తుతం మూడు నెలల వ్యవధిలో కార్మికులు 50 గంటలు OT  చేయవచ్చు. దీన్ని 125 గంటలకు పెంచారు. OT ల కారణంగా మానసిక, శారీరక సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ: 

SBI ఖాతాదారులకు శుభవార్త

DOWNLOAD JEE Main Admit Card 2022

 మీ S.R. లో అన్ని ఎంట్రీస్ ఉన్నాయా?

IBPS CRP RRB XI Recruitment 2022 – 8106 Posts