RBI repo rate: రూ.లక్షకు EMI ఎంత పెరుగుతుందంటే?: గృహ, వాహన, పర్సనల్ లోన్

 RBI repo rate: రూ.లక్షకు EMI ఎంత పెరుగుతుందంటే?: గృహ, వాహన, పర్సనల్ లోన్

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది. రెపో రేట్‌ను మళ్లీ పెంచింది. నెల రోజుల వ్యవధిలో రేపో రేట్ పెంచడం ఇది రెండోసారి. కిందటి సారి కంటే ఈ పెంపు మరింత అధికం. ఇదివరకు 40 బేసిస్ పాయింట్ల మేర పెంచగా.. తాజాగా ఇప్పుడు ఈ సంఖ్యను 50కి పెంచింది. 50 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.

రేపో రేట్ 4.9 శాతానికి.. 

ఫలితంగా రెపో రేట్ 4.9 శాతానికి పెరిగింది. దీని ప్రభావం వడ్డీ రేట్ల మీద విపరీతంగా పడింది. బ్యాంకులన్నీ తమ వడ్డీ రేట్లను మరోసారి సవరించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో మూడురోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ కమిటీ సమీక్షలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను శక్తికాంత దాస్ వెల్లడించారు. కొన్ని ఊరటలను కల్పించారు.

READ: HOME LOANS: గృహ రుణ వ‌డ్డీ రేట్ల పెంపు ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది?

లోన్లు భారం.. 

కాగా- 50 బేసిస్ పాయింట్లను పెంచడం వల్ల రేపో రేట్ 4.9 శాతానికి పెరిగింది. దీని ప్రభావం లోన్లపై పడుతుంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న లోన్లపై ప్రతి నెలా రుణ గ్రహీతలు చెల్లించే ఈక్వెటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ మొత్తం మరింత పెరుగుతుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు ఈ మేరకు తమ బేసిస్ పాయింట్లను సవరించడం ఖాయం.

గృహావసరాల కోసం.. 

గృహావసరాల కోసం 30 లక్షల రూపాయల లోన్ తీసుకున్న వారి అవుట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ గడువు 20 సంవత్సరాలకు ఏడుశాతం మేర పెరుగుతుంది. 30 లక్షల రూపాయల రుణానికి ఇప్పుడు 23,259 రూపాయల ఈఎంఐ చెల్లిస్తుంటే అది పెరుగుతుంది. 24,907 రూపాయలకు చేరుతుంది. అంటే 1,648 రూపాయలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Flash...   ITI అర్హత తో APSRTC నుండి 309 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ ఇదే..

READ: RBI: నేడు కొత్త ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్న RBI.. రుణాలు మరింత ప్రియం..