SBI ఖాతాదారులకు శుభవార్త

SBI ఖాతాదారులకు శుభవార్త..

ముంబై:  దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)  తన ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది.  ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వ‌డ్డీ రేట్లు పెంచే సంకేతాలిచ్చింది.  తాజా ద్వైమాసిక రివ్యూలో ఆర్బీఐ రెపో రేటును  50 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో ఎస్‌బీఐ  నిర్ణయం  తీసుకోనుంది.  ఈ మేరకు ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖరా ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచనున్నట్టు  నేషనల్‌ మీడియా నివేదించింది.

READ: HOME LOANS: గృహ రుణ వ‌డ్డీ రేట్ల పెంపు ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది?

ఆర్‌బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతంగా నిర్ణయించింది. ఫలితంగా  పలు రుణాలపై ఈఎంఐ భారం పెరగనుంది.  ఆర్‌బీఐ క్రమంగా రేట్లు పెంచుతూ ఉంటే, బ్యాంకులు తమ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా పెంచాల్సి వస్తుంది. దీంతో తాజా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కొత్త రేట్ల ప్రకారం ఉంటాయనీ, ఇప్పటికే నిర్దిష్ట మెచ్యూరిటీల పై డిపాజిట్ రేట్లను పెంచాలని భావిస్తున్నట్టు ఖరా వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఎస్‌బీఐ 12 నెలల – 24 నెలల వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై  5.10 వడ్డీ రేటును అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే  మూడు నుండి ఐదు సంవత్సరాల  ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.45 శాతంగా  ఉంది.

EPF ఖాతాకు సంబంధించిన వివరాలు MISS CALL ఇలా తెలుసుకోండి

 READ: RBI repo rate: రూ.లక్షకు EMI ఎంత పెరుగుతుందంటే

ALSO READ: 

1.Postal Jobs: 38926 JOBS in the Postal Department
2. SSC JOB NOTIFICATION 2022: NOTIFICAITON FOR 2065 POSTS Through SSC
3. SBI: ENGAGEMENT OF RETIRED BANK STAFF ON CONTRACT BASISRailway Jobs:
4.రాత పరీక్ష లేకుండా.. రైల్వేలో 1044 ఉద్యోగాలు.. 10వ త‌ర‌గ‌తి పాస్ చాలు

Flash...   ఉపాధ్యాయులకు సెలవులు రద్దు