Tube less tyre: గాలిలేని, పంక్చర్లు పడని టైర్లు వచ్చేస్తున్నాయి.. ఎలా పనిచేస్తాయంటే.

 గాలిలేని, పంక్చర్లు పడని టైర్లు వచ్చేస్తున్నాయి.. ఎలా పనిచేస్తాయంటే.

రోడ్డు పక్కన కారు టైర్ మార్చుకోవడం లేదా గాలిపోయిన టైర్లతో ఆగిపోయిన కార్లు మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.

కొన్నిసార్లు కాలం చెల్లకముందే టైర్లు దెబ్బతింటాయి. డ్రైవర్లు తరచూ ప్రెజర్ ఎంత ఉందో చూసుకోకపోవడం కూడా దీనికి ఒక కారణం.

కార్లలో అన్నింటికంటే బలహీనమైన పార్ట్ ఏదని అడిగితే చాలా మంది టైర్లనే చెబుతారు. అయితే, ఇది త్వరలో మారపోనుంది.

గాలితో నిండిన గుండ్రని టైర్లు 1890ల్లో మొదటిసారి ఉపయోగించారు. వీటి స్థానంలో కొత్త టైర్లు రాబోతున్నాయి.

లక్సెంబర్గ్‌లోని ఒక ట్రాక్‌పై టెస్లా మోడల్-3ను ఇటీవల టెస్టు రైడ్స్ చేశారు. దీనిలో అమెరికాకు చెంది గుడ్‌ఇయర్ సంస్థ తయారుచేసిన నాలుగు వాయు రహిత టైర్లు (ఎయిర్‌లెస్ టైర్లు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

దీనిలో ప్రత్యేకమైన ప్లాస్టిక్ స్పోక్స్, రబ్బరుతో చేసిన పుల్లలు ఉన్నాయి. కారు వెళ్తున్నప్పుడు రోడ్డుమీద ఉండే ఎత్తుపల్లాలకు అనుగుణంగా ఈ టైరు కాస్త వంగుతుంది, వేగంగా తిరుగుతుంది.

”కొంచెం శబ్దం వస్తుంది. చిన్న వైబ్రేషన్లు కూడా ఉంటాయి. అయితే, రైడ్‌ను మరింత హాయిగా మార్చేందుకు దీన్ని మెరుగుపరుస్తున్నాం. వీటిపై ప్రయాణిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు”అని గుడ్ఇయర్ సంస్థలోని నాన్ న్యుమేటిక్ టైర్స్ (ఎన్‌పీటీ) విభాగం సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మైఖెల్ రచిట చెప్పారు.

24 గంటలూ…

ఎలక్ట్రిక్ కార్లు, అటానమస్ వెహికల్స్‌ రాకతో టైర్లలోనూ మార్పులు వస్తున్నాయి. నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండే, పంక్చర్లు కానీ, మళ్లీమళ్లీ ఉపయోగించగలిగే, రోడ్డు పరిస్థితులను అంచనా వేయగలిగే సెన్సర్‌లు ఉండే ఉత్పత్తుల కోసం కార్ల తయారీ సంస్థలు చూస్తున్నాయి.

నగరాల్లో సొంతంగా కార్లు కొనుక్కునే వారితో పోలిస్తే.. రెంట్‌కు బుక్ చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, నిర్వహణ సరిగాలేకపోతే ఇలా కార్లు బుక్ చేసుకునే వారు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.


”గాలితో నిండి ఉండే టైర్ల స్థానాన్ని ఇవి పూర్తిగా భర్తీ చేస్తాయని చెప్పడం లేదు. కానీ, ఇప్పుడు మనకు కొత్త పరిష్కారాలు కావాలి. మనం అటానమస్ వెహికల్స్ సాధారణమైపోయే ప్రపచంలోకి అడుగుపెట్టాం. ఇప్పుడు చాలా నగరాల్లో రవాణా సదుపాయాలను వ్యూహాత్మక సేవల రంగంలో భాగంగా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండే టైర్లు ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది”అని మైఖెల్ వివరించారు.

Flash...   Dragon Fruit Benefits : డ్రాగన్ ఫ్రూట్ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

మరోవైపు గుడ్ఇయర్‌కు గట్టి పోటీ ఇచ్చే మిషెలిన్ ల్యాబ్‌లో ఇలాంటి టైర్లను 24 గంటలూ నడిపి పరీక్షిస్తున్నారు. భిన్నమైన బరువులు, అత్యధిక వేగాల వద్ద పరీక్షిస్తున్నారు.

”వేల మైళ్లు ఇవి హాయిగా వెళ్లగలుగుతున్నాయి. కొన్నిసార్లు టైర్లలోని స్పోక్స్ విరుగుతున్నాయి. అయినప్పటికీ వీటితో ఎలాంటి ప్రమాదమూ ఉండదు”అని మైఖెల్ తెలిపారు. ”ప్రస్తుతం ఇవి పరీక్షల దశలో ఉన్నాయి. అయితే, ఇవి మాకు నమ్మకాన్ని ఇస్తున్నాయి. ఇవి బాగా పనిచేస్తాయని మేం కచ్చితంగా చెప్పగలం”అని మైఖెల్ అన్నారు.

వాయు రహిత టైర్ల కోసం జనరల్ మోటార్స్ (జీఎం)తో కలిసి 2019 నుంచి మిషెలిన్ పనిచేస్తోంది.

మిషెలిన్ ప్రత్యేకంగా తయారుచేసిన పంక్చర్ ప్రూఫ్ టైర్ సిస్టమ్ (యూపీటీఐఎస్)ను చెవ్రోలెట్ బోల్ట్ ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే అవకాశముందని, 2024నాటికి ఇవి అందుబాటులోకి రావొచ్చని మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ యూపీటీఐఎస్ టైర్లను అత్యంత దృఢంగా ఉండే రేసిన్ పాలిమర్లు, ఫైబర్‌గ్లాస్, కంపోసైట్ రబ్బర్‌లను ఉపయోగించారు. ఇది నడిచినప్పుడు అల్యూమినియం తరహా శబ్దం వస్తోంది. ఈ టైర్ల కోసం 50 పేటెంట్లకు మిషెలిన్ దరఖాస్తు చేసింది.

బోల్ట్ కార్లలో ఈ టైర్లను ఉపయోగిస్తారనే వార్తలను మిషెలిన్ సంస్థ సైంటిఫిక్, ఇన్నోవేషన్ ఎక్స్‌పర్ట్ సిరిల్ రోజెట్ ధ్రువీకరించలేదు. అయితే, ఈ ఏడాది చివర్లో దీనిపై ప్రకటన వెలువడే అవకాశముందని అన్నారు.

వాయురహిత టైర్ల తయారీలో మిగతా సంస్థలతో పోలిస్తే మిషెలిన్ ముందుంది. ట్వీల్ (టైర్-వీల్)ను 2005లోనే సంస్థ ఆవిష్కరించింది. నెమ్మదిగా వెళ్లే వాహనాలు, వ్యవసాయ ఉత్పత్తుల్లో వీటిని ఉపయోగిస్తున్నారు.

ఆ టైర్లను సాధారణ రోడ్లకు సరిపడేలా మార్పులు చేయడం సవాళ్లతో కూడుకున్న పని అని రోజెట్ చెప్పారు. ”మాకు ఈ రంగంలో 130 ఏళ్ల అనుభవముంది. న్యుమాటిక్ టైర్లు, ఎయిర్‌లెస్ టెక్నాలజీలను మేం పరీక్షిస్తున్నాం”అని ఆయన అన్నారు.

వాయు రహిత రైట్ల దిశగా పడిన తొలి అడుగుగా యూపీటీఐఎస్ టైర్లను చెప్పుకోవచ్చు. పునర్వినియోగ, వాయురహిత, 3డీ ముద్రిత టైర్ల కోసం సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

Flash...   నెలకు రూ.2,80,000 జీతంతో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

కొన్ని సార్లు స్పోక్స్ వంగినప్పటికీ, వీటి నిర్వహణ ఖర్చు పెద్దగా ఏమీ ఉండదని మిషెలిన్ సంస్థ చెబుతోంది.

భారీ బ్యాటరీల వల్ల కార్ల బరువు పెరుగుతుంటుంది. అలాంటప్పుడు వాయు రహిత టైర్లు సరిగ్గా సరిపోతాయి. ”సాధారణ టైర్ల కంటే వీటిలో ఎక్కువ బరువును తరలించొచ్చు”అని మైఖెల్ చెప్పారు.

అయితే, ఎయిర్‌లెస్ టైర్లతో కారుకు అవసరమయ్యే విద్యుత్ కూడా పెరుగుతుంది. ఫలితంగా బ్యాటరీ సామర్థ్యంపై ప్రభావం పడొచ్చు.

మరోవైపు రోడ్డుపై రబ్బరు శబ్దం కూడా చేస్తుంటుంది.

”ఎలక్ట్రిక్ కార్లతో ఇంజిన్ శబ్దం తగ్గించుకోవచ్చు. అయితే, వాటి స్థానంలో టైర్ల శబ్దం ఎక్కువగా వినిపించొచ్చు”అని టైర్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ ఎడిటర్ మ్యాట్ రాస్ అన్నారు.

అయితే, ఇప్పుడు వినియోగదారులు ఏం అనుకుంటున్నారు? అనే దాని కంటే ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకుంటారనే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

వీటికి అనుమతి ఇచ్చే ముందు ప్రభుత్వాలు సేఫ్టీ టెస్టులు, ప్రమాణాల పరీక్షలు చేపడతాయి. మరోవైపు టైర్ల తయారీ సంస్థలు కొత్త తయారీ సదుపాయాలు, సప్లై చైన్లపై భారీ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. దీని కోసం ఏళ్ల సమయం పట్టొచ్చు.

అయితే, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే సంస్థలతో ఎయిర్‌లెస్ టైర్ టెక్నాలజీ పరిజ్ఞానం కూడా వేగం పుంజుకుంటుందని టైర్ల తయారీ సంస్థలు ఆశిస్తున్నాయి.

”మిలిటరీ, విపత్తుల నిర్వహణ, సెక్యూరిటీ వాహనాలు, స్పెషల్ మెషినరీ లాంటి రంగాల్లో నాన్-న్యుమాటిక్ టైర్లు (ఎన్‌పీటీ)లు చక్కగా ఉపయోగపడతాయి”అని హన్‌కూక్‌లోని యూరోపియన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం హెడ్ క్లాస్ క్రాస్ చెప్పారు.

దక్షిణ కొరియాకు చెందిన హన్‌కూక్ సంస్థ కొత్త ఎన్‌పీటీ ”ఐఫ్లెక్స్”ను గత జనవరిలోనే ఆవిష్కరించింది. ఇది సాధారణ టైర్ కంటే కాస్త చిన్నగా ఉంటుంది. ఒత్తిడిని తట్టుకుని ఇది చక్కగా ముందుకు వెళ్లగలదని సంస్థ తెలిపింది.

ప్రపంచంలోనే అతిపెద్ద టైర్ మేకర్ బ్రిడ్జిస్టోన్ కూడా వ్యవసాయం, గనుల తవ్వకం, నిర్మాణం తదితర రంగాల వాహనాల్లో ఈ కొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

Flash...   Influenza virus: H3N2 కొవిడ్ మాదిరిగా వ్యాపిస్తోంది.. జాగ్రత్త! - ఎయిమ్స్

ఎయిర్‌లెస్ టైర్లు కొత్తలో కాస్త ఎక్కువ ధర ఉండొచ్చు. అయితే, 3డీ ప్రింటింగ్‌తో దీనిలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముంది. ఇప్పటికిప్పుడే ఈ టైర్లను కొనుగోలు చేయాల్సిన అవసరంలేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరికొందరు అయితే, ఈ టైర్లను ముందు ఉచితంగా అందించి, వీటిలో ఉండే సెన్సర్ల సాయంతో ఎన్ని మైళ్లు ప్రయాణించారో గుర్తించి, దాని ప్రకారం డబ్బులు వసూలు చేసే పరిజ్ఞానం అందుబాటులోకి రావొచ్చని వివరిస్తున్నారు.

”భవిష్యత్ టైర్లను టెక్నాలజీనే నడిపిస్తుంది”అని గుడ్‌ఇయర్‌లోని టైర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన విశ్లేషకురాలు సోసియా కాసెరెట్ జోస్టెన్ చెప్పారు. ”రోడ్లు, వాహనాల మధ్య ఏకైక కాంటాక్ట్ టైర్లు మాత్రమే. అందుకే భవిష్యత్ టెక్నాలజీ దీనితో ముడిపడి ఉండబోతోంది”అని ఆమె అన్నారు.

”అయితే, కొత్తగా అందుబాటులోకి వచ్చే అన్ని టెక్నాలజీలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని అనుకోకూడదు. భద్రత, సౌకర్యం, పెర్ఫార్మెన్స్, సస్టెయినబిలిటీ అనేవే ఇక్కడ ముఖ్యం. ప్రస్తుతం ఇవన్నీ మనకు గాలితో నిండిన టైర్లతో లభిస్తున్నాయి. కొత్తగా వచ్చే టెక్నాలజీలు దీన్ని భర్తీ చేసేలా ఉండాలి”అని ఆమె వివరించారు.

మిగతా సంస్థల్లానే గుడ్ఇయర్ కూడా గ్రీన్ ఉత్పత్తుల కోసం కృషి చేస్తోంది. ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి ఉత్పత్తి చేసిన పాలిస్టర్‌ను కొత్త టైర్లలో ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ప్రస్తుతం అందుబాటులోనున్న రబ్బర్లకు ప్రత్యామ్నాయాలు చాలా తక్కువగా ఉన్నాయని జర్మనీకి చెందిన కాంటినెంటల్ కార్ టైర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ డెనిస్ స్పెర్స్ అన్నారు. ”ప్రస్తుతమున్న ఎయిర్ టైర్లను అందుకే ఏళ్ల నుంచీ కొనసాగిస్తున్నారు”అని ఆయన అన్నారు.

ALSO READ: 

SBI ఖాతాదారులకు శుభవార్త

DOWNLOAD JEE Main Admit Card 2022

 మీ S.R. లో అన్ని ఎంట్రీస్ ఉన్నాయా?

IBPS CRP RRB XI Recruitment 2022 – 8106 Posts