Watermelon: పుచ్చకాయని ఫ్రిజ్‌లో పెట్టి తింటున్నారా .. అయితే ఈ సమస్యలు తప్పవు..!

 Watermelon: పుచ్చకాయని ఫ్రిజ్‌లో పెట్టి తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!

Watermelon: వేసవి కాలంలో ప్రజలు ఎక్కువగా పుచ్చకాయని కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయం తినడం వల్ల వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండవచ్చు. ఇందులో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు, పీచు వంటి అనేక పోషకాలు ఉంటాయి. పుచ్చకాయలో ఉండే పీచు ఆకలిని నియంత్రిస్తుంది కాబట్టి బరువు సులువుగా బరువు తగ్గవచ్చు. అయితే చాలామంది పుచ్చకాయ కొన్న తర్వాత కట్ చేసి ఫ్రిజ్‌లో పెడుతారు. ఇలా చేయడం వల్ల చాలా సమస్యలు ఉంటాయని తెలియదు. పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచి తినడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

పోషక విలువలు తగ్గుతాయి

పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. దాని బయటి భాగం చాలా మందంగా ఉంటుంది. దీని కారణంగా పుచ్చకాయ త్వరగా చెడిపోదు. సుమారు 15-20 రోజులు ఉంటుంది. అందుకే దీనిని ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు పుచ్చకాయని కట్‌ చేసి ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే అందులో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయని గుర్తుంచుకోండి. అలాగే కెరోటినాయిడ్ స్థాయి కూడా తగ్గుతుంది.

చల్లని పుచ్చకాయ తినడం మంచిది కాదు

పుచ్చకాయ ఎండాకాలంలో ఉపశమనాన్ని ఇచ్చే నీటి పండు. అయితే ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల పోషకాలు తగ్గిపోతాయి. అలాగే చల్లని పుచ్చకాయ తినడం వల్ల దగ్గు, జలుబు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీరు చాలా సమయం పాటు ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయ తింటే మీకు ఫుడ్-పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ తాజా పుచ్చకాయను మాత్రమే తినండి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Flash...   NMMS - Enrollment for Scholarships before 31.10.2020